సెలబ్రిటీలు తాగిపడేసిన చుట్టలనో, వాడిపారేసిన షర్టులో, వాచ్‌లో, అండర్‌వేర్‌లనో కొన్నారంటే ఏమో అనుకోవచ్చు. మరీ దరిద్రంగా ఉమ్మి, గోర్లు, చుండ్రు వగైరా వగైరాలను ఎవరైనా కొంటారా? అలాంటివి కూడా కొనే వాళ్లున్నారు. ఇలాంటి బాపతుగాళ్లు ఉన్నారని తెలిసే అమెరికాకు చెందిన ఓ మోడల్‌ ఇలాంటివి అమ్ముతూ లక్షలకు లక్షలు సంపాదించేస్తోంది. అమెరికా నార్త్‌ కరోలినాకు చెందిన రెబెక్కా బ్లూ (rebecca blue) అనే మోడల్‌ (modal)గతంలో ఎగ్జోటిక్‌ డాన్సర్‌గా (exotic dancer)ఉండింది. ఇప్పుడు వెబ్‌క్యామ్‌ మోడల్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటోంది.

సెలబ్రిటీలు తాగిపడేసిన చుట్టలనో, వాడిపారేసిన షర్టులో, వాచ్‌లో, అండర్‌వేర్‌లనో కొన్నారంటే ఏమో అనుకోవచ్చు. మరీ దరిద్రంగా ఉమ్మి, గోర్లు, చుండ్రు వగైరా వగైరాలను ఎవరైనా కొంటారా? అలాంటివి కూడా కొనే వాళ్లున్నారు. ఇలాంటి బాపతుగాళ్లు ఉన్నారని తెలిసే అమెరికాకు చెందిన ఓ మోడల్‌ ఇలాంటివి అమ్ముతూ లక్షలకు లక్షలు సంపాదించేస్తోంది. అమెరికా నార్త్‌ కరోలినాకు చెందిన రెబెక్కా బ్లూ (rebecca blue) అనే మోడల్‌ (modal)గతంలో ఎగ్జోటిక్‌ డాన్సర్‌గా (exotic dancer)ఉండింది. ఇప్పుడు వెబ్‌క్యామ్‌ మోడల్‌, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటోంది. దాంతో పాటుగా తన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ బోల్డంత డబ్బును సంపాదిస్తోంది. మొదట తన స్ట్రిప్పింగ్‌ అవుట్‌ఫిట్స్‌ను(outfits) 20 డాలర్లకు ఓ వ్యక్తికి అమ్మింది. తర్వాత ఇదేదో బాగుందనుకుంది. తన దగ్గర ఉన్న వస్తువులను అమ్మడం మొదలుపెట్టింది. అలా 28 ఏళ్లకే బిలినియర్‌ అయ్యింది. మొదట్లో పాపం సాక్స్‌ (socks )వంటి వాటినే అమ్మేది. అటు పిమ్మట తాను ఏది అమ్మితే అది కొనుక్కొడానికి కొందరు రెడీగా ఉన్నారని తెలుసుకుంది. ఇప్పుటు ఉమ్మి, కాలి గోర్లు(Toe nails), కత్తిరించిన చర్మం, చుండ్రు,(Dandruff) చివరాఖరుకు ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని కూడా అమ్మడం మొదలెట్టేసింది. ఛీ పాడు.. ఇలాంటివి కూడా కొంటారా అని ఆశ్చర్యపోకండి. కోనేవాళ్లు ఉన్నారు కాబట్టే ఆమె అమ్ముతోంది.. ఇంతకు ముందు అమెరికాకే చెందిన మాజీ రియాల్టీ టీవీ స్టార్‌ స్టెఫానీ మాటో అనే ఆవిడ తన అపాన వాయువును బాటిళ్లలో నింపి అమ్ముకుంది. ఈ బిజినెస్‌లో ఆమె బాగానే డబ్బు గడించింది. అంతకంటే దరిద్రం కాదుగా.. ప్రస్తుతం రెబెక్కా బ్లూ నెలకు రెండువేల డాలర్లకు పైగానే సంపాదిస్తోంది. మన లెక్కల్లో చెప్పాలంటే లక్షన్నర రూపాయలకంటే ఎక్కువే!

Updated On 13 April 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story