Corona Virus : కరోనా పుట్టుకకు వుహాన్ ల్యాబ్ కారణం కాదా? అమెరికా నిఘా సంస్థలు చెప్పింది వింటే షాకవుతారు...
ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టి, లక్షలాది మంది ప్రాణాలను తీసుకుని, ఎంతోమందిని వ్యాధిగ్రస్తులను చేసి, ఆర్ధికవ్యవస్థలను కూల్చిన మహమ్మారి కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. అసలు ఈ వైరస్‌ను ఎవరు పుట్టించారు? ఎవరు ప్రపంచం మీదకు వదిలారు? అన్న ప్రశ్నలు కరోనా స్వైరవిహారం చేస్తున్నప్పట్నుంచి మెదులుతూనే ఉన్నాయి.
ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టి, లక్షలాది మంది ప్రాణాలను తీసుకుని, ఎంతోమందిని వ్యాధిగ్రస్తులను చేసి, ఆర్ధికవ్యవస్థలను కూల్చిన మహమ్మారి కరోనా వైరస్(Corona Virus) ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది. అసలు ఈ వైరస్‌ను ఎవరు పుట్టించారు? ఎవరు ప్రపంచం మీదకు వదిలారు? అన్న ప్రశ్నలు కరోనా స్వైరవిహారం చేస్తున్నప్పట్నుంచి మెదులుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు చైనా(china) వుహాన్‌లోని(wuhan) ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్(Institute Of Vir0logy Lab) నుంచే కరోనా వైరస్ పుట్టిందిని గట్టిగా నమ్మాయి. చైనాను నిందితురాలిని చేశాయి. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్-19 వైరస్ వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందని భావించాయి. అమెరికా(america) అయితే పదే పదే చైనాపై నిందలు మోపుతూ వచ్చింది.
చైనా మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా మాటే నిజమయ్యింది. కరోనా వ్యాప్తిలో చైనా పాత్ర ఏమీ లేదని స్పష్టమయ్యింది. చైనాకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నది ఎవరో కాదు, అమెరికానే! కోవిడ్ మహమ్మారి పుట్టుకకు వుహాన్ ల్యాబ్ కారణమనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని తాజాగా అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదికలోని సారాంశం. అయితే కరోనా ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాలపై నిఘా సంస్థలు స్పష్టత ఇవ్వలేకపోయాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు మరో సంస్థ కూడా ఈ దర్యాప్తును చేపట్టింది. లేటెస్ట్‌గా నాలుగుపేజీల నివేదిక బయటకు వచ్చింది.
'వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌పై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. కానీ ఆ వైరస్ వ్యాప్తి అక్కడి నుంచే మొదలయ్యిందనడానికి ఆధారాలు(evidence) మాత్రం దొరకలేదు. ప్రత్యక్షంగా ఆ ల్యాబ్ నుంచి వైరస్ పుట్టిందని చెప్పడానికి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు' అని ఏజెన్సీలు తమ నాలుగు పేజీల నివేదికలో పేర్కొన్నాయి. 'కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనాపై విస్తృత పరిశోధనలు జరిగాయి. కానీ, ప్రీ కోవిడ్ టైంలో అలాంటి వైరస్‌ల మీద పరిశోధనలు జరిగినట్లు ఆధారాలు దొరకలేదు' అని రిపోర్ట్ పేర్కొంది. గతంలో కరోనా పుట్టుకకు చైనానే కారణమంటూ పలు అధ్యయనాలు ఆరోపిస్తూ వచ్చాయి. అమెరికా సంస్థల ఆరోపణలలో నిజాలను నిగ్గు తేల్చానికి వుహాన్‌లోని ల్యాబ్‌ను 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సందర్శించింది. డబ్ల్యుహెచ్‌వో బృందం కూడా ఎటూ తేల్చలేకపోయింది. అప్పుడు అమెరికా నిఘా సంస్థలు కూడా చైనాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాయి.