Shruthi Kumar Graduation Speech : హార్వర్డ్ యూనివర్సిటీలో శ్రుతి కుమార్ భావోద్వేగ ప్రసంగం.. ఎవరీ అమ్మాయి?
మార్వర్డ్ యూనివర్సిటీ(Howard University) గ్రాడ్యుయేషన్ సభలో(Graduation) ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ శ్రుతి కుమార్(Shruthi Kumar) అందరి హృదయాలను గెల్చుకుంది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి అయిన శ్రుతి కుమార్ గాజా(Gaza) సంఘీభావ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. వారిపై చర్య తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేసింది.

Shruthi Kumar Graduation Speech
మార్వర్డ్ యూనివర్సిటీ(Howard University) గ్రాడ్యుయేషన్ సభలో(Graduation) ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ శ్రుతి కుమార్(Shruthi Kumar) అందరి హృదయాలను గెల్చుకుంది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి అయిన శ్రుతి కుమార్ గాజా(Gaza) సంఘీభావ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. వారిపై చర్య తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది శ్రుతి కుమార్. విద్యార్థులు, అధ్యాపకుల మాటలను హార్వర్డ్ వినడం లేదని చెప్పింది. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతికుమార్ ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్(Power Of not Knowing) పేరుతో రెడీ చేసుకున్న ప్రసంగానికి బదులుగా మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ఉద్వేగభరితంగా, ఆవేదనతో ప్రసంగించింది. శ్రుతి ప్రసంగం ముగిసిన తర్వాత అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్ అంతా కరతాళధ్వనులతో మారుమోగింది. దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్‌లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుంచి హార్వర్డ్ వరకు సాగిన తన ప్రయాణం గురించి వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్‌ల గురించి ప్రస్తావించింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి నిరాకరించింది. అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న కారణంగా వారికి గ్రాడ్యుయేషన్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే!
