కుండపోతగా వర్షాలు కురుస్తున్నప్పుడు వరదలు పోటెత్తడం సహజం! వరదలు ముంచుకొస్తే సమస్తాన్ని ముంచేయడం కూడా సర్వసాధారణం. ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టమూ సంభవిస్తుంటుంది. వరదలకు(Floods) అగ్రరాజ్యము, చిన్న రాజ్యమూ అన్న తేడాలుండవు. ఎక్కడైనా ఒకే తీరుగా విజృంభిస్తాయి.

కుండపోతగా వర్షాలు కురుస్తున్నప్పుడు వరదలు పోటెత్తడం సహజం! వరదలు ముంచుకొస్తే సమస్తాన్ని ముంచేయడం కూడా సర్వసాధారణం. ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టమూ సంభవిస్తుంటుంది. వరదలకు(Floods) అగ్రరాజ్యము, చిన్న రాజ్యమూ అన్న తేడాలుండవు. ఎక్కడైనా ఒకే తీరుగా విజృంభిస్తాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలోని(America) న్యూయార్క్‌(New york) నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అయిదారు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీధులు చెరువుల్లా మారిపోయాయి. బయటకు వెళితే ఏమవుతుందోనన్న భయంతో జనం ఇంటికే పరిమితమయ్యారు.

రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వరద ఉధృతిలో చాలా మట్టుకు కొట్టుకుపోయాయి. అప్పట్లో చెన్నై నగరాన్ని, ఆ మధ్యన కేరళను వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఎన్నో వాహనాలు(Vehicles) నీటిలో కొట్టుకపోయాయి. నీట మునిగాయ. ఆ విధంగా దెబ్బతిన్న కార్లను వదలబుద్ధేయ్యదు. ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా అంతగా రాదు. ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టేసుకుని మళ్లీ ఆ కార్లను ఉపయోగిస్తుంటారు. మళ్లీ కొత్త కారు కొనడమంటే మాటలు కాదుగా! అమెరికాలో అయితే ఇలా చేయరు. ఒక్కసారి వరదనీటిలో కారు ఇంజిన్‌ తడిసిందా..? మళ్లీ దాన్ని ఎవరూ ముట్టుకోరు. స్క్రాప్‌లాగే చూస్తారు.

అమెరికాలో లగ్జరీ కార్ల(Luxary Cars) ధరలు మామూలుగా ఉండవు. లక్షన్నర డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు ఉంటాయి! ఇంత ఖరీదైన కార్లు కూడా నీళ్లలో తడిచాయంటే వాటి విలువ దారుణంగా పడిపోతుంది. సపోజ్‌ బురద నీళ్లలో ఇంజిన్‌ తడిసిందే అనుకుందాం! దానికి అయిదు డాలర్లు కూడా ఎవరూ ఇవ్వరు. అందుకే యజమానులు ఇలాంటి కార్లను ఇన్సెరెన్స్‌ వాళ్లకు ఇచ్చేసి కొత్త కార్లు కొంటుంటారు.

నీళ్లలో మునిగిన కార్లను ఏం చేస్తారంటే తక్కువ ధరకు జంక్‌ యార్డ్‌లు లేదా వెహికిల్‌ రీబిల్డర్‌లకు(Vehicles rebuilders) వేలంలో(Auction) అమ్మేస్తారు. వాటిని కొనుగోలు చేసిన వారు కెన్యా(Kenya), జింబాబ్వే(Zimbabwe), నైజీరియా(Nigeria) వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. కారు వరదల్లో మునిగితే ఇంజిన్‌లో కాస్త సమస్యలు వస్తాయి. ఇంటీరియర్‌ దెబ్బతింటుంది. లోపల సీట్లు కూడా పాడవుతాయి. కొన్నవారు వాటిని పూర్తిగా మార్చేస్తారు. వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగిస్తారు.

ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు అమ్ముతారు. అంటే రెండు లక్షల డాలర్ల విలువ చేసే కార్లు కేవలం 40వేల డాలర్లకే అమ్ముతారన్నమాట! వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు.అయితే ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పని చేస్తాయో చెప్పలేం. కాకపోతే తక్కువ ధరకు కార్లు కావాలనుకునేవారు వీటిని కొనుగోలు చేస్తారు. అంటే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో(Arica) కొంతమంది లాభపడుతారన్నమాట! కెన్యా, నైగర్‌, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు వరదలో మునిగిన కార్లు దిగుమతి చేసుకుంటాయి.

కొంచెం ఖర్చు పెట్టి కొత్త కారులా తయారు చేసుకుంటున్నాయి. నీళ్లలో మునిగిన కారుకు సాంకేతికసమస్యలు వస్తాయి. ఇంజిన్‌ కొంత పాడవుతుంది. ఇంజిన్‌లో సమస్యలు వస్తే బాగుచేయడం కొద్దిగా కష్టం. అందుకే అమెరికాలో ఇలాంటి కార్లను ఉపయోగించరు. ఒక్క ఇంజినే కాదు, కార్పెట్లు, సీట్లు, లైట్లు, ఎయిర్‌ ఫిల్టర్‌ ఇవన్నీ దెబ్బతింటాయి. కొన్ని రోజులైతే తుప్పు కూడా పడతాయి. అందుకే వీటిని తక్కువ ధరకు అమ్ముతుంటారు. ఆడి, బెంజ్‌, బీఎమ్‌డబ్ల్యూ, లెక్సస్‌, ఫోర్డ్‌, ఫోక్స్‌ వాగన్‌ వంటి లగ్జరీ కార్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌ విషయంలో కూడా ఇప్పుడు బెంగపెట్టుకోనక్కర్లేదు. చైనా కంపెనీలు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను క్రాకర్‌ వర్షన్‌లో అమ్ముతున్నాయి. అందుకే కొత్త కారులా తయారవుతున్నాయి. మరి ఇండియాకు ఇలాంటి కార్లు ఎందుకు రావడం లేదంటే మన సర్కారు ఇలాంటి డీల్స్‌ను ఒప్పుకోవడం లేదు మరి!

Updated On 3 Oct 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story