Titanic Submarine : తీరం చేరిన టైటాన్ శకలాలు, కుళ్లిన స్థితిలో సాహసికుల శవాలు
అట్లాంటిక్(Atlantic) మహా సముద్రంలో వందేళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక(Titanic Ship) శకలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగురు పర్యాటకులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ అయిదుగురు సాహసికులను సముద్రగర్భంలోకి తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్(Submersible) ఒత్తడికి తట్టుకోలేక పేలిపోయింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఇన్ని రోజుల తర్వాత ఆ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన టైటాన్ ప్రయాణం కాసేపటికే విషాదంగా ముగిసింది.
అట్లాంటిక్(Atlantic) మహా సముద్రంలో వందేళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక(Titanic Ship) శకలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగురు పర్యాటకులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ అయిదుగురు సాహసికులను సముద్రగర్భంలోకి తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్(Submersible) ఒత్తడికి తట్టుకోలేక పేలిపోయింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఇన్ని రోజుల తర్వాత ఆ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన టైటాన్ ప్రయాణం కాసేపటికే విషాదంగా ముగిసింది. నాలుగు రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై అమెరికా కోస్ట్‌గార్డ్(America Cost Guard) అధికారికంగా ఒక ప్రకటన చేసింది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక ముందుభాగంలో 16 వందల అడుగుల దగ్గర, దాదాపు ఆరున్నర మీటర్ల పొడవు, 10,431 కిలోల వరకు బరువున్న టైటాన్ కూరుకుపోయినట్టు ఇంతకు ముందు ప్రకటించిన అధికారులు ఇప్పుడు అతి కష్టం మీద ఆ శకలాలను బయటకు తెచ్చారు. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్ రీసెర్చ్ కంపెనీ తన ఒడీస్సెస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్‌ను సబ్‌మెర్సిబుల్ వెతుకురాట కోసం ఉపయోగించింది. అత్యంత జాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. వారి పరిశోధన తర్వాత ప్రమాదం జరిగిన తీరు, వారు ఎలా చనిపోయారనే దానిపై ఒక అంచనాకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.