ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా(America)కు వెళుతున్న భారతీయ విద్యార్థుల(Indian Students)కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. అమెరికా ఎయిర్‌పోర్టుల్లో(America Airport) ఇమిగ్రేషన్‌ ఇంటరాగేషన్‌తో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేక తడబడుతున్నారు. వీసా అప్లికేషన్‌ టైమ్‌లో సమాచారంపై ఇమిగ్రేషన్‌ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. సరైన సమాధానాలు ఇవ్వలేని సుమారు రెండు వేల మందిని అమెరికా వెనక్కి పంపించింది. ఇందులో తెలుగువారే 300 మందికిపైగా ఉన్నారు. అమెరికాలో అడుగుపెట్టినట్టే పెట్టి వెనక్కి […]

ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా(America)కు వెళుతున్న భారతీయ విద్యార్థుల(Indian Students)కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. అమెరికా ఎయిర్‌పోర్టుల్లో(America Airport) ఇమిగ్రేషన్‌ ఇంటరాగేషన్‌తో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేక తడబడుతున్నారు. వీసా అప్లికేషన్‌ టైమ్‌లో సమాచారంపై ఇమిగ్రేషన్‌ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. సరైన సమాధానాలు ఇవ్వలేని సుమారు రెండు వేల మందిని అమెరికా వెనక్కి పంపించింది. ఇందులో తెలుగువారే 300 మందికిపైగా ఉన్నారు. అమెరికాలో అడుగుపెట్టినట్టే పెట్టి వెనక్కి వచ్చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ దిగగానే ఇండియన్‌ ఇమిగ్రేషన్‌ టీమ్‌ కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. అమెరికాకు వెళ్లి ఎందుకు తిరిగి వచ్చారన్న దానిపై దర్యాప్తు మొదలు పెట్టింది. ఫేక్‌ డ్యాకుమెంట్లు ఏమైనా పెట్టి ఉంటారా? అని ఎంక్వైరీ చేస్తున్నారు. అమెరికాలో అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు అడిగే ప్రశ్నలు మరి అంత కఠినమైనవి కాకపోయినా మన విద్యార్థులు జవాబివ్వడానికి కొంచెం తడబడ్డారని, కొన్నింటికి బదులివ్వలేక మౌనంగా ఉండిపోయారని సమాచారం.

1.మీ దగ్గర క్రెడిట్‌, డెబిట్ కార్డులు ఏమైనా ఉన్నాయా?
2.మీతో ఎన్ని డాలర్ల సొమ్ము తెచ్చుకున్నారు?
3.అమెరికాలో మీరు ఎక్కడ ఉండబోతున్నారు?
4.యుఎస్‌లో మీకు తెలిసివాళ్లు ఉన్నారా?
5.మీకు తెలిసినవాళ్ల వీసా స్టేటస్‌ ఏమిటి?
6.వీసా తీసుకోవడానికి సహాయం చేసిందెవరు?
7.ఆన్‌లైన్‌ క్లాసులకు రిజిస్టర్‌ చేసుకున్నారా?
8.అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యి లోన్‌ వివరాలు చూపిస్తారా?
9.మీ నాన్న అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యి బ్యాలెన్స్‌ చూపించగలరా?
10. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ చూపించడానికి ఎవరు సాయం చేశారు?
11. మీ ఫోన్‌లో పూర్తి సమాచారాన్ని మేము చూడొచ్చా?
12.ఎంబసీకి డ్యాక్యుమెంట్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు?
13.మీరు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నారా? దానికి మందులు వాడుతున్నారా?
ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థులను ఇబ్బంది పెట్టారు ఇమిగ్రేషన్‌ అధికారులు. చాలా ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో తడబాటుకు గురయ్యారు. తాము రాండమ్‌గా తాము విద్యార్థులను టెస్ట్ చేస్తున్నామే తప్ప, ఏరికోరి తెలుగువారినో , భారతీయులనో ఎంపిక చేయలేదని అధికారులు చెబుతున్నా, కేవలం హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లినవారిపైనే ఎక్కువగా నిఘా పెట్టినట్టు అర్థం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు? వాట్సప్‌ సందేశాలు ఎలా ఉన్నాయి? వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు.

Updated On 18 Aug 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story