జనవరి నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు(Work from office) వెళ్లే విధానాన్ని అమలు చేయాలన్న కంపెనీ నిర్ణయాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సీఈవో మాట్ గార్మాన్(Matt Garman) బహిరంగంగా సమర్థించారు.

జనవరి నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు(Work from office) వెళ్లే విధానాన్ని అమలు చేయాలన్న కంపెనీ నిర్ణయాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సీఈవో మాట్ గార్మాన్(Matt Garman) బహిరంగంగా సమర్థించారు. వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావడానికి ఇష్టపడని ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లిపోవచ్చని గార్మాన్ స్పష్టం చేశారు. ఒక వేళ ఐదురోజులు పనికి రాకుంటే వారికి మన కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఇతర కంపెనీలు కూడా ఉన్నాయని పరోక్షంగా ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కలెక్టివ్‌ వర్క్‌ విషయంలో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తి లేదని అమెజాన్ వెబ్‌ సర్వీసెస్ సీఈవో గార్మాన్ అన్నారు. వర్క్‌ ఫ్రం హోంతో కొత్త ఆవిష్కరణలు, కలెక్టివ్‌ వర్క్‌ పనితీరు క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. నిజంగా ఆసక్తికరమైన ఉత్పత్తులపై ఆవిష్కరణ చేయాలనుకున్నప్పుడు, వ్యక్తిగతంగా ఉద్యోగులు లేనప్పుడు ఇవి సాధ్యం కావని గార్మాన్ అన్నారు. ఇప్పుడున్న వారానికి మూడు రోజుల పనివిధానంతో ఉద్యోగులు వేర్వేరు రోజుల్లో ఆఫీస్‌కు రావడంతో టీం సభ్యుల మధ్య గ్యాప్‌ వస్తోందని, తద్వారా ప్రాజెక్టుల పనితీరుపై ప్రభావం పడుతోందని అమెజాన్‌ చెప్తోంది. అమెజాన్ పాలసీలను రిమోట్ వర్క్‌తో ఇంప్లిమెంటేషన్‌ చేయడం సాధ్యం కాదని కంపెనీ వెల్లడించింది. ఐదు రోజులు ఆఫీస్‌ వెళ్లడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల పనితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రయాణసమయం, ఒత్తిడి పెరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. మూడు రోజుల పాలసీని వ్యతికించి ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు. కొత్త పాలసీకి అనుగుణంగా ఉద్యోగాలు చేయలేమని భావించే వారి కోసం చాలా కంపెనీలు ఉన్నాయని గార్మాన్ అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story