తమ సిబ్బందిని జనవరి నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని అమేజాన్‌(Amazon) కోరుతోంది

తమ సిబ్బందిని జనవరి నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని అమేజాన్‌(Amazon) కోరుతోంది. దీనికి సంబంధించి సీఈవో ఆండీ జాస్సీ(Andy jasni) సెప్టెంబర్ 16న మెమోలో రాశారు. జనవరిలో ప్రారంభమయ్యే కొత్త పాలసీకి ఉద్యోగులు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు జాస్సీ తన మెమోలో రాశారు. పేర్కొన్నరాఉ. ప్రస్తుతం అమెజాన్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయంలో ఉంటున్నారు. లేఖలో గత ఐదు సంవత్సరాలుగా కార్యాలయంలో కలిసి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ముఖ్యమైనవి అని నమ్ముతున్నామన్నారు. కార్యాలయాల్లో సిబ్బంది ఉంటేనే ఒకరినొకరి మధ్య సంబంధాలు బలపడుతాయని నమ్ముతున్నామన్నారు. అయితే అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు లేదా ఐసోలేషన్ అవసరం వంటి కారణాల వల్ల మినహాయింపులు ఇప్పటికీ ఉంటాయన్నారు. ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకు సహేతుక కారనాలు చెప్తేనే వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. బ్యూరోక్రసీని తగ్గించడం, టీం సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉద్యోగులు, మేనేజర్ల సంబంధాలను మెరుగుపర్చడం ద్వారా అమెజాన్ సంస్థాగత నిర్మాణాన్ని నిలుపుకోగలదని జాస్సీ తెలిపారు. వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాలని చెప్పిన తొలి కంపెనీగా అమేజాన్ నిలిచింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలన్న నిబంధనలు పాటిస్తున్నాయి. అయితే కొంత మంది ఉద్యోగులు దీనిని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. కొందరు రాజీనామా చేసి తమకు నచ్చిన కంపెనీలకు మారిపోయారు.

Eha Tv

Eha Tv

Next Story