No Rain Village : ఆ ఊళ్లో చుక్క వాన కూడా పడదు.. ఎక్కడుందా గ్రామం?
వానలో తడవని మనిషంటూ ఉంటాడా? ఎందుకొచ్చిందా అనుమానం అంటారా? భూమి అంతటా ఒకే రకమైన వాతావరణం ఉండదు కదా! ఇక్కడ ఎండలు దంచి కొడుతుందో మరో చోట వాన కుమ్మెస్తుంటుంది. ఇంకో చోట ఎముకలు కొరికేంత చలి గజగజలాడిస్తుంటుంది. కాకపోతే అసలు వాన చుక్కే కురవని ఓ గ్రామం ఒకటుంది. అక్కడున్నవారు ఊరు విడిచి బయటకు వెళితే తప్ప వానలో తడిసే అవకాశం ఉండదు.
వానలో తడవని మనిషంటూ ఉంటాడా? ఎందుకొచ్చిందా అనుమానం అంటారా? భూమి అంతటా ఒకే రకమైన వాతావరణం ఉండదు కదా! ఇక్కడ ఎండలు దంచి కొడుతుందో మరో చోట వాన కుమ్మెస్తుంటుంది. ఇంకో చోట ఎముకలు కొరికేంత చలి గజగజలాడిస్తుంటుంది. కాకపోతే అసలు వాన చుక్కే కురవని ఓ గ్రామం ఒకటుంది. అక్కడున్నవారు ఊరు విడిచి బయటకు వెళితే తప్ప వానలో తడిసే అవకాశం ఉండదు. ఆ గ్రామం పేరు అల్-హుతైబ్. యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న ఈ ఊరు భూ ఉపరితలానికి 3, 200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. సూర్యుడు ఉదయించడమే తరువాయి ఊరంతా వేడెక్కిపోతుంది. అదే సంధ్య కాగానే విపరీతమైన చలి మొదలవుతుంది. ఇంతకీ ఆ ఊర్లో అసలు వాన పడకపోవడానికి కారణమేమిటంటే మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఆ ఊరు ఉండటమే! భూమి నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉండాలి. కానీ ఈ ఊరు భూమికి మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మేఘాల కంటే ఎత్తులో ఊరుందన్న మాట! అందుకే ఎప్పుడూ వర్షం పడదు. మేఘాలను మన చేత్తో తాకొచ్చు కూడా. ప్రపంచంలోనే డ్రై సిటీగా ఇది పేరుపొందింది. ఇక్కడ ఆల్ బోహ్రా తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్ అంటారు. అక్కడ నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్ ట్యాంకర్లతో ప్రతి రోజును నీటిని సరఫరా చేస్తారు. ఇంత విశేషం ఉన్న ఊరుకు టూరిస్టులు రాకుండా ఎలా ఉంటారు? తండోపతండాలుగా వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉన్న ఈ వింత గ్రామమే కాదు, కొండ కిందభాగంలో ఉన్న చిన్న చిన్న జలపాతాలు కూడా టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. అల్ హుతైబ్ కొండపై క్వాట్ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు.