Japan Surname Issue : కొన్నాళ్లుపోతే జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు ఉంటుంది!
జపాన్‌లో(Japan) వివాహచట్టాలు కఠినంగా(Marriage Law) ఉంటాయి. వాటిని సవరించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో అందరికీ ఒకే ఇంటిపేరు ఉంటుంది. పెళ్లి చేసుకున్న జంటలకు వేర్వేరు ఇంటిపేర్లను(Surname) ఉంచుకునే హక్కును కల్పించకపోతే మాత్రం 2531 నాటికి జపాన్ ప్రజల పేర్ల చివరl సాటో అనేది మిగులుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
జపాన్‌లో(Japan) వివాహచట్టాలు కఠినంగా(Marriage Law) ఉంటాయి. వాటిని సవరించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో అందరికీ ఒకే ఇంటిపేరు ఉంటుంది. పెళ్లి చేసుకున్న జంటలకు వేర్వేరు ఇంటిపేర్లను(Surname) ఉంచుకునే హక్కును కల్పించకపోతే మాత్రం 2531 నాటికి జపాన్ ప్రజల పేర్ల చివరl సాటో అనేది మిగులుతుందని ఓ అధ్యయనంలో తేలింది. జపాన్‌లో 18వ శతాబ్దం నాటి సివిల్‌కోడ్ చట్ట ప్రకారం దంపతులిద్దరికీ ఒకే ఇంటి పేరు ఉండాలి. జపాన్‌లో ప్రస్తుతం మూడు లక్షల ఇంటి పేర్లు ఉన్నాయి. ఆ దేశంలో ఎక్కువగా వినిపించే ఇంటి పేరు సాటో.. దాదాపు 18 లక్ష మంది పేర్ల పక్కన సాటో(Sato) కనిపిస్తుంది. ఆ తర్వాత స్థానాలలో సుజుకీ(Suzuki), తకహాషి(Takashi) ఉన్నాయ. ఇప్పటికే ఆ దేశంలో భార్యాభర్తలు వేర్వేరు ఇంటిపేర్లను పెట్టుకొనే విధంగా చట్టాలను మార్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అదీ కాక జపాన్‌లో పెళ్లిళ్ల రేటు బాగా తగ్గింది. ప్రస్తుతం జపాన్‌లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2022తో పోలిస్తే 2023లో వివాహాలు ఆరు శాతం తగ్గాయి. దాదాపు 12 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో అయిదు లక్షల కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పం.