ప్రపంచంలోని చాలా దేశాలు అర్ధిక మాంద్యంతో అల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవల చైనా(China) కూడా ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవి చూసింది. ఇప్పటి వరకు భారత్‌కు ఆ పరిస్థితి తలెత్తలేదు కానీ లేటెస్ట్‌గా మెన్స్‌ అండర్‌వేర్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడం కలవరపెడుతోంది. ఆర్ధిక నిపుణులను అప్రమత్తం చేస్తున్నది. ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు బాగా తగ్గాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు అర్ధిక మాంద్యంతో అల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవల చైనా(China) కూడా ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవి చూసింది. ఇప్పటి వరకు భారత్‌కు ఆ పరిస్థితి తలెత్తలేదు కానీ లేటెస్ట్‌గా మెన్స్‌ అండర్‌వేర్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడం కలవరపెడుతోంది. ఆర్ధిక నిపుణులను అప్రమత్తం చేస్తున్నది. ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు బాగా తగ్గాయి. ద్రవ్యోల్పణం కారణంగా తమ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు మొదట లోదుస్తుల(under wear) కొనుగోలును వాయిదా వేస్తారన్నది ఆర్ధికవేత్తల పరిశోధనలో తేలిన సత్యం. దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో అండర్‌గార్మెట్‌ దుస్తుల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.లాస్టియర్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోదుస్తుల విక్రయాలు తగ్గాయి. లోదుస్తుల అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అండర్‌వేర్లలో జాకీ(Jockey) బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని పేజ్‌ ఇండస్ట్రీస్‌(Page industries) తయారు చేస్తుంది. ప్రస్తుతం పేజ్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం తగ్గింది. అమ్మకాలు కూడా బాగా తగ్గాయి.గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ పరిమితులను మించిపోతోంది. ఆర్ధిక నిపుణుల అభిప్రాయం ప్రకారం లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం ఆర్ధికవ్యవస్థకు చెడు సంకేతమే! ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల సూచికను అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ అధిపతి అలాన్‌ గ్రీన్‌స్పాన్‌ రూపొందించారు. దీని ప్రకారం ఓ దేశంలో మెన్స్‌ అండర్‌వేర్ల అమ్మకాలు తగ్గాయంటే ఆ దేశం ఆర్ధికవ్యవస్థ బాగోలేదని అర్థం. 2007-2009 మధ్యకాలంలో అమెరికాలో ఇదే జరిగింది. అక్కడ ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు లోదుస్తుల అమ్మకాలు తగ్గాయి. 1970లో గ్రీన్‌స్పాన్‌ పురుషుల లోదుస్తుల సూచిక సిద్ధాంతాన్ని వెలువరించారు.పురుషుల లోదుస్తుల విక్రయ గణాంకాలు కీలక ఆర్థిక సూచికలని ఆయన చెప్పారు.లో దుస్తులు బయటకు కనిపించవు. అందుకే ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరైనా చేసే మొదటి పని లో దుస్తులను కొనడం ఆపేయడం! అమెరికా తీవ్ర ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొన్న కాలంలో పురుషుల అండర్‌వేర్ల విక్రయాలలో క్షీణత కనిపించింది. 2010 తర్వాత ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది. దాంతో ఆటోమాటిక్‌గా పురుషుల లో దుస్తుల అమ్మకాలు కూడా పెరిగాయి.

Updated On 21 Sep 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story