Aishwarya Reddy Death : అమెరికా కాల్పుల ఘటనలో హైదరాబాద్ అమ్మాయి మృతి
అమెరికాలో(America) గన్‌కల్చర్‌కు(Gun culture) హైదరాబాద్ అమ్మాయి బలైంది. టెక్సాస్(Texas) రాష్ట్రం అలెన్(Allen) పట్టణంలోని ఓ మాల్‌లో జరిగిన కాల్పులలో ఎనిమిది మంది కన్నుమూసిన విషయం తెలిసిందే.
అమెరికాలో(America) గన్‌కల్చర్‌కు(Gun culture) హైదరాబాద్ అమ్మాయి బలైంది. టెక్సాస్(Texas) రాష్ట్రం అలెన్(Allen) పట్టణంలోని ఓ మాల్‌లో జరిగిన కాల్పులలో ఎనిమిది మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల తాటికొండ ఐశ్వర్యరెడ్డి(Aishwarya Reddy) చనిపోయింది. నర్సిరెడ్డి(Narsi Reddy), అరుణ(Aruna) దంపతులు తమ కూతురు మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు. నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం మాల్‌కు కారులో వచ్చిన ఓ దుండగుడు మాల్‌లో ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
అక్కడ ఉన్నవారంతా భయభ్రాంతులయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కాల్పుల చప్పుళ్లు, జనం అరుపులు అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీసుకు వినపడింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆయన వచ్చి దుండగుడిని కాల్చి చంపాడు. అప్పటికే దుండగుడి కాల్పులకు అయిదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఏడుగురు చికిత్స తీసుకుంటున్నారు.