బంగారం స్మగ్లింగ్‌ (Gold Smuggling) చేస్తూ ఓ ఎయిర్‌ హోస్ట్‌ (Air Hostess) పట్టుబడింది. దాదాపు కిలో బంగారాన్నిరహస్య భాగాలలో దాచుకుని తరలిస్తుండగా
డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (Directorate of Revenue Intelligence) అధికారులు పట్టుకున్నారు.

బంగారం స్మగ్లింగ్‌ (Gold Smuggling) చేస్తూ ఓ ఎయిర్‌ హోస్ట్‌ (Air Hostess) పట్టుబడింది. దాదాపు కిలో బంగారాన్నిరహస్య భాగాలలో దాచుకుని తరలిస్తుండగా
డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (Directorate of Revenue Intelligence) అధికారులు పట్టుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్నదాని ప్రకారం నిందితురాలు సురభి ఖాతూన్‌ (Surabhi Khatun) ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌(Air India Express)లో ఎయిర్‌హోస్ట్‌గా పని చేస్తున్నది. కోల్‌కతాకు చెందిన ఆమె ఈ నె 28వ తేదీన మస్కట్‌ నుంచి కేరళలోని కన్నూర్‌కు వచ్చిన విమానంలో క్రూ సిబ్బందిగా ఉన్నది. విమానం కన్నూర్‌ విమానాశ్రయానికి (Kannur Airport)కు చేరుకోగానే సమాచారం అందుకున్న అధికారులు ఆమెను తనిఖీ చేశారు. అందులో ఆమె బండారం బయటపడింది. ఆమె రహస్య భాగంలో సుమారు 960 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని సురభి ఖాతూన్‌(Surabhi Khatun)ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాతామెను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. బంగారాన్ని స్మగ్లింగ్‌ చేయడం సురభి ఖాతున్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు చాలా సార్లు ఇలాగే బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్టు విచారణలో తేలింది.

Updated On 31 May 2024 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story