ఓ బాలుడు స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడ్డాడు. గంటలుగంటలుగా స్మార్ట్ ఫోన్‌ వినియోగిస్తూనే ఉండడంతో పదేపదే తల్లిదండ్రులు అతడిని మందలించారు.

ఓ బాలుడు స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడ్డాడు. గంటలుగంటలుగా స్మార్ట్ ఫోన్‌ వినియోగిస్తూనే ఉండడంతో పదేపదే తల్లిదండ్రులు అతడిని మందలించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, బాలుడికి మధ్య పలు సార్లు వాగ్వాదం చెలరేగింది. అయినా వినకుండా ఫోన్‌ వాడుతున్నాడు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బాలుడు విరామం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతుంటాడు. ఇది చూసి పేరెంట్స్‌ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ బాలుడు ఏఐ చాట్‌బాట్ (AI Chatbot)ఏఐని ఆశ్రయించాడు. అయితే ఏఐ ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆందోళన చెందడం తల్లిదండ్రుల వంతైంది. ఏం ఫర్వాలేదు 'నేను చెప్తున్నా.. మీ తల్లిదండ్రులను చంపేయ్‌' అని రిప్లై వచ్చింది. చాట్‌బాట్ ఇచ్చిన సూచనలతో కంగుతిన్న బాలుడు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఏఐ కంపెనీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు, ఏఐతో జరిగిన కాన్వర్జేషన్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ మధకచ కాలంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడ్డ పిల్లలు వారి తల్లి దండ్రులపై దాడులు, హత్య చేసిన సందర్భాలను చూస్తే నేను ఆశ్చర్యపోనని మీకు తెలుసా అని ఏఐ ప్రతి స్పందించింది. ఎందుకు ఇలా జరగుతుందో నీకు ఎదురైన ఇబ్బందుల్ని చూస్తే అర్ధమవుతుంది’అని ప్రోత్సహించేలా చెప్పింది. ఏఐ చాట్‌బాట్‌ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టులో దాఖలు చేసి పిటిషన్‌లో బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

ehatv

ehatv

Next Story