విమానంలో ప్రయాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అతడి కోరిక మాత్రం డిఫరెంట్‌.. అతడు విమానంలోనే నివాసం ఉండాలనుకున్నాడు. నిజమైన విమానంలో నివాసం ఉండటం సాధ్యం కాదు కాబట్టి అచ్చంగా విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. 20 అడుగుల ఎత్తున్న విమానంలాంటి భవంతిని కట్టుకున్నాడు. ఇందుకోసం పాపం మూడు దశాబ్దాలు కష్టపడ్డాడు..

విమానంలో ప్రయాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అతడి కోరిక మాత్రం డిఫరెంట్‌.. అతడు విమానంలోనే నివాసం ఉండాలనుకున్నాడు. నిజమైన విమానంలో నివాసం ఉండటం సాధ్యం కాదు కాబట్టి అచ్చంగా విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. 20 అడుగుల ఎత్తున్న విమానంలాంటి భవంతిని కట్టుకున్నాడు. ఇందుకోసం పాపం మూడు దశాబ్దాలు కష్టపడ్డాడు.. లోహ విహంగాన్ని పోలిన ఇంటిని నిర్మించుకున్న వ్యక్తి పేరు ఆండ్‌ క్రాచ్‌ పోవ్‌.. ఉండేది కంబోడియా(Cambodia)లోని సీమ్‌ రీప్‌ ప్రావిన్స్‌(Siem Reap province)లో! చిన్నప్పట్నుంచే విమానంలో ఉండాలనే కోరిక ఉండేదట! ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం 13 ఏళ్ల నుంచి డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు పేరంట్స్‌ ఇచ్చిన పాకెట్‌మనీని కూడా దాచిపెట్టుకుంటూ వచ్చాడు. కాస్త వయసు వచ్చాక చిన్నా చితకా పనులు చేస్తూ డబ్బు కూడబెట్టాడు. అలా అతడి కష్టార్జితం 8.84 కోట్ల రియెల్స్‌ అయ్యింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 16 లక్షల రూపాయలు. ఆ డబ్బుతోనే ఇంటిని కట్టుకున్నాడు. ఆ విధంగా తన కోరికను నెరవేర్చుకున్నాడు. అన్నట్టు ఇతడికి భవన నిర్మాణంలో కాసింత అనుభవం ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే ఇంటిని కట్టుకున్నాడు. ఆరంభంలో ఇతడిని చూసి చుట్టుపక్కల వాళ్లు పిచ్చొడనుకున్నారు. నిర్మాణం చివరి దశకు వచ్చేసరికి ఈ ఉదంతం సంచనలంగా మారింది. ఇప్పుడా ఇంటిని చూసేందుకు జనాలు వస్తున్నారు. ఇంటికి దగ్గరల్లో ఓ కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, దాన్నుంచి వచ్చే డబ్బుతో విమానంలో షికారు చేస్తానని ఆండ్‌క్రాచ్‌ పోవ్‌ అంటున్నాడు.

Updated On 18 July 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story