ఆఫ్రికా(Africa) ఖండంలోని నమీబియా(Namibia) దేశంలో హింబా అనే తెగకు(Himba tribes) చెందిన ప్రజలు నివసిస్తారు. ఈ ప్రజలు జీవితంలో ఏరోజూ స్నానం చేయరు. పెళ్లి చేసుకున్ననాడే ఒకసారి స్నానం(bath) చేస్తారు. స్నానం చేయడానికి ఈ తెగలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితాంతంలో పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారు. అంతేకాకుండా ఈ తెగకు చెందిన స్త్రీలు బట్టలు ఉతకేందుకు కూడా నీటిని ఉపయోగించరు.

ఆఫ్రికా(Africa) ఖండంలోని నమీబియా(Namibia) దేశంలో హింబా అనే తెగకు(Himba tribes) చెందిన ప్రజలు నివసిస్తారు. ఈ ప్రజలు జీవితంలో ఏరోజూ స్నానం చేయరు. పెళ్లి చేసుకున్ననాడే ఒకసారి స్నానం(bath) చేస్తారు. స్నానం చేయడానికి ఈ తెగలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితాంతంలో పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారు. అంతేకాకుండా ఈ తెగకు చెందిన స్త్రీలు బట్టలు ఉతకేందుకు కూడా నీటిని ఉపయోగించరు. ఈ తెగ యొక్క మొత్తం జనాభా సుమారు 50 వేలు ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయమే(Agriculture) ఈ తెగ జీవనాధారం. ఈ ప్రజలు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ తెగ ప్రజలు ఏ రోజూ స్నానం చేయరు. స్నానం చేయకపోయినా కూడా వీళ్లు శుభ్రంగా ఉంటారు. అదెలా అనుకుంటున్నారా..!

హింబా తెగ ప్రజల అలవాట్లు శతాబ్దాల కిందట ఎలా ఉందో ఇప్పటికీ అవే పాటిస్తున్నారు. ఈ తెగ ప్రజలు తమను క్రిముల నుంచి రక్షించుకునేందుకు పొగ స్నానం చేస్తారు. ప్రత్యేక మూలికలను నీటిలో ఉడకబెట్టి ఆ ఆవిరితో వారు శుభ్రం చేసుకుంటారు కానీ స్నానం చేయరు. దీంతో వారి శరీరం నుంచి చెడు వాసన రాదు. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రత్యేకంగా తయరాఉ చేసిన లోషన్‌ రాసుకుంటారు. జంతువుల కొవ్వు, ప్రత్యేక ఖనిజ హెమటైట్ నుంచి ఈ లోషన్‌ను తయారుచేసుకొని శరీరానికి రాసుకుంటారు. ఈ తెగలో స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పుట్టిన తేదీని పరిగణించరు. తల్లులు కావాలనుకున్న స్త్రీలు పిల్లలకు సంబంధించిన పాటలు వినాలని ఈ తెగ నాయకులు సూచిస్తారు. ఆ మహిళ చెట్టు కింద కూర్చుని పిల్లలకు సంబంధించిన పాటలు వింటుంది. ఆ తర్వాత స్త్రీ తన భాగస్వామికి పాట పాడి వినిపిస్తుంది. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆమె ఈ పాటను ఇతర తెగ మహిళలకు నేర్పుతుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అప్పుడప్పుడూ ఇదే పాట బిడ్డ కోసం తల్లి పాడుతూ ఉంటుంది.

Updated On 1 March 2024 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story