Africa Drought : భయంకరమైన కరువు.. ఆకలి తీర్చుకోవడానికి ఏనుగుల హతం!
ఆఫ్రికా(Africa) దేశమైన నమీబియాలో(Namibia) భయంకరమైన కరువు(Drought) ఏర్పడింది.
ఆఫ్రికా(Africa) దేశమైన నమీబియాలో(Namibia) భయంకరమైన కరువు(Drought) ఏర్పడింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు కడుపు నిండా తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దాంతో సుమారు 700 అరుదైన అడవి జంతువులను చంపేసి ఆ మాంసాన్ని ప్రజలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో ఏనుగురు(Elephants), జీబ్రాలు(Zebra), నీటి గుర్రాలను కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని నమీబియాకు చెందిన పర్యావరణ, అటవీ, పర్యాటక మంత్రిత్వ శాఖలు తెలిపాయి. 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, వంద బ్లూవైల్డ్ బీస్టులు, 300 జీబ్రాలు మనుషుల ఆకలి తీర్చబోతున్నాయి. కరువు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో నమీబియాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అంటే దేశ జనాభాలో సగానికి సగం మంది తిండి దొరకక అల్లాడిపోతున్నారు. అడవి జంతువులను చంపేస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందనేది అధికారుల భావన. పైగా కరువు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వన్యప్రాణులు జనవాసాలపైకి వస్తున్నాయి.
ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో రెండు లక్షలకు పైగా ఏనుగులు ఉంటాయి. పాపం గత ఏడాది తాగేందుకు నీరు దొరక్క చాలా ఏనుగులు చనిపోయాయి. ఒక్క బోట్సవానాలోనే లక్షా 30 వేల ఏనుగులు ఉన్నాయి.
2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ప్రజలు ఒత్తిడి చేయడంతో అయిదేళ్లకే నిషేధాన్ని తొలగించింది.