ఆఫ్రికా(arica) దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్‌(Monkey pox) మహావేగంగా విస్తరిస్తోంది.

ఆఫ్రికా(arica) దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్‌(Monkey pox) మహావేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. లేటెస్ట్‌గా ఆ వైరస్‌ పాకిస్తాన్‌కు(Pakistan) పాకింది. పాకిస్తాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్‌ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3 తేదీన సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో మంకీ పాక్స్‌ ఉన్నట్టు తేలింది. వెంటనే అలెర్టయిన పాకిస్తాన్‌ ఆరోగ్య శాఖ ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించింది. వారికి కూడా వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story