Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో మరోమారు భారీ భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌లో బుధవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం వాయువ్య ఆఫ్ఘనిస్తాన్ వైపు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం.
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో బుధవారం ఉదయం తీవ్ర భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు(Richter Scale)పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం వాయువ్య ఆఫ్ఘనిస్తాన్ వైపు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. ఉదయం 6.11 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆస్థి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సివుంది.
అంతకుముందు శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. దేశంలో ఈ ప్రకంపనల కారణంగా కనీసం నాలుగు వేల మంది మరణించినట్లు సమాచారం. రెండు వేలకు పైగా ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాని నుంచి కోలుకోకముందే ఈ ఉదయం మళ్లీ భూమి కంపించింది. కేవలం నాలుగు రోజుల్లో వ్యవధిలోనే రెండు భారీ భూకంపాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూసింది.