Afghanistan : మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కౌరవులలో వికర్ణుడులాంటి వారు ఉన్నట్టుగానే తాలిబన్లలో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్‌లాంటి వారు ఉంటారు. తప్పులను ఎత్తి చూపడటంలో వెనుకాడరు. అఫ్గనిస్తాన్ విదేశాంగ డిప్యూటీ మంత్రిగా వ్యవహరిస్తున్న షేర్ మహమ్మద్ అబ్బాస్ మహిళల విద్యాపై ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. తాలిబన్లకు ప్రజలు దూరం కావడానికి మహిళల విద్యపై ఆంక్షలు విధించడమేనని ధైర్యంగాచెప్పారు.
కౌరవులలో వికర్ణుడులాంటి వారు ఉన్నట్టుగానే తాలిబన్లలో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్‌లాంటి వారు ఉంటారు. తప్పులను ఎత్తి చూపడటంలో వెనుకాడరు. అఫ్గనిస్తాన్ విదేశాంగ డిప్యూటీ మంత్రిగా వ్యవహరిస్తున్న షేర్ మహమ్మద్ అబ్బాస్ మహిళల విద్యాపై ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. తాలిబన్లకు ప్రజలు దూరం కావడానికి మహిళల విద్యపై ఆంక్షలు విధించడమేనని ధైర్యంగాచెప్పారు. అఫ్గానిస్థాన్ సరిహద్దు మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కోసం నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలికల విద్య కోసం పాఠశాలను తిరిగి తెరవాలని, జ్ఞానం లేని సమాజం చీకటితో సమానమని చెప్పారు. 'విద్య ప్రతి ఒక్కరి హక్కు. భగవంతుడు ప్రజలకు కల్పించిన సహజమైన హక్కు. దానిని ప్రజల నుంచి ఎవరైనా ఎలా దూరం చేయగలరు? దీనిని ఎవరైనా అతిక్రమిస్తే అది అఫ్గానిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. పాఠశాలలను, కళాశాలలను తిరిగి అందరి కోసం తెరవాలి. చదవుపై ఆంక్షల కారణంగానే పొరుగు దేశాలు మనకు దూరం అవుతున్నాయి. మన వల్ల (తాలిబన్లు) దేశం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే.. అందుకు ఇదే కారణం’ అని అబ్బాస్ అన్నారు. రెండేళ్ల కిందట అఫ్గానిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చారు తాలిబన్లు. వచ్చి రాగానే మహిళలు, బాలికలపై పలు ఆంక్షలు విధించారు. బాలికలు ఆరో తరగతికి మించి చదవాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం మండిపడింది. ఇన్నాళ్లకు మహిళల విద్యపై తాలిబన్ మంత్రి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.