Private Military : దేశాలకు ప్రైవేటు సైన్యం కూడా ఉంటుందా?
పలు దేశాలకు ప్రైవేట్ సైన్యం(Private Army) ఉంటుందని మీకు తెలుసా..! దేశం కోసం ఈ ప్రైవేటు సైన్యం ఏం చేస్తుంది..? ప్రతీ దేశానికి ఎన్నో అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆర్మీ(army), నేవీ(Navy), వాయుసేనలతో భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి. శత్రు దేశాలు దాడులకు దిగితే తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉంటాయి. ఉగ్రదాడులను సైతం ఈ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటుంటాయి. అంతర్గత భద్రత కూడా ఏర్పాటు చేసుకొని శాంతిభద్రతలను పటిష్టపరుచుకుంటాయి ఆయా దేశాలు.

భద్రతా నిర్వహణకై పలు దేశాలు చాలా బడ్జెట్‌ను కేటాయిస్తుంటాయి. అయితే చాలా దేశాల్లో ప్రైవేట్ సైన్యం కూడా ఉంటుంది. అసలు ఈ ప్రైవేట్ ఆర్మీ ఏం చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ ఆర్మీని ఆయా దేశాలు ఉపయోగిస్తాయి. ఈ ప్రైవేట్ ఆర్మీలో కూడా వేల సంఖ్యలో ఉంటారు. చాలా దేశాలు చాల ఖర్చుపెట్టి ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించుకుంటున్నాయి. దేశ భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుంటాయి. దురదృష్టం కొద్దీ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఈ ప్రైవేట్ సైన్యం రంగంలోకి దిగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ ఆర్మీ ఉన్న గ్రూప్ వాగ్నర్.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఈ వాగ్నర్ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. ఈ గ్రూప్ చాలా ప్రమాదకరమైంది. రష్యాకు మద్దతుగా ఏర్పడిన ఈ గ్రూప్, ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాలుపంచుకుంటోంది. కొన్ని రోజుల తర్వాత పుతిన్‌కు ఎదురుతిరిగినా, మళ్లీ పుతిన్‌కే మద్దతిస్తూ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది ఈ వాగ్నర్ గ్రూప్. దాదాపు కొన్ని వేల మంది వాగ్నర్ గ్రూప్‌లో ఉన్నారు. ట్రిపుల్ క్యానోపీ అనే మరో ప్రైవేట్ సైన్యం అమెరికా కోసం పనిచేస్తోంది. 2001లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఈ ప్రైవేట్ సైన్యం ఏర్పడింది.
అమెరికా, ఇరాక్ యుద్ధంలో ఈ ట్రిపుల్ క్యానోపీ (Triple Canopy) సైన్యం కీలక పాత్ర వహించింది. ఇరాక్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈ ట్రిపుల్ క్యానోపీ అక్కడే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పెరూ దేశంలోనూ డిఫైన్ ఇంటర్నేషనల్ (Define international) అనే ప్రైవేట్ సైన్యం ఉంది. లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్‌లో ఈ సైన్యం సేవలు కొనసాగిస్తున్నాయి. దుబాయ్, శ్రీలంక, ఫిలిప్పైన్స్, ఇరాక్‌లోనూ డిఫైన్ ఇంటర్నేషనల్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
మరో ముఖ్యమైన ప్రైవేట్ ఆర్మీ ఏంటంటే ఏజీస్ డిఫెన్స్ సర్వీసెస్ (Aegis Defence Services). ఏజీస్ మెయిన్ ఆఫీస్ లండన్‌లో ఉంది. దాదాపు 60కిపైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.ఇలా ఎన్నో దేశాల్లో ప్రైవేట్ ఆర్మీలు ఉన్నాయి. చాలా దేశాల్లో ప్రైవేట్ ఆర్మీలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా ఈ ప్రైవేట్ ఆర్మీలు ప్రజలను, ఆస్తులను కాపాడుతుంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతుంటాయి. దేశం కోసం ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటాయి ఈ పైవేట్ ఆర్మీలు.