Nithyananda Kailasa PM Ranjitha : ప్రియ శిష్యురాలికి ప్రధాని పదవి! స్వామిపై గుర్రుగా ఉన్న శిష్య బృందం!
వివాదాస్పద స్వామి నిత్యానంద(Nithyananda) మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. తానే సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి కైలాసమనే పేరు పెట్టేసుకుని రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే కదా! అత్యాచారం కేసుతో పాటు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ముందు జాగ్రత్తగా భారతదేశం నుంచి పారిపోయి
వివాదాస్పద స్వామి నిత్యానంద(Nithyananda) మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. తానే సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి కైలాసమనే పేరు పెట్టేసుకుని రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే కదా! అత్యాచారం కేసుతో పాటు పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ముందు జాగ్రత్తగా భారతదేశం నుంచి పారిపోయి ఈక్వెడార్(Ecuador) తీరంలో ఓ సొంత దేశాన్ని నిర్మించుకుని శిష్యులతో హాయిగా జీవిస్తున్నాడు. ఇప్పుడాయనకు పెద్ద సమస్య వచ్చిపడింది. శిష్యులంతా ఆయనపై గుర్రుగా ఉన్నారట! అందుకు కారణం తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రజిత(Actress Ranjitha)కు ఆయన ప్రధానమంత్రి పదవి అప్పగించారట! రంజితను ప్రధానిగా చేయడం శిష్యులకు ఇష్టం లేదు. నిత్యానందకు వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన రంజితకు గత జూలైలో ప్రధాని పదవిని అప్పగించారని తెలిసింది. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి రంజిత ధోరణి పూర్తిగా మారిపోయిందనేది శిష్యుల ప్రధాన ఆరోపణ. పదవి వచ్చినప్పటి నుంచి ఆమెలో అహంకారం పెరిగిందని, తానే దేశాధ్యక్షురాలు అనే భావనతో తమను చులకన చేస్తున్నారని శిష్య బృందం అంటోంది. కైలాస దేశంలోని సంస్థలను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. శిష్యులంతా ప్రధాని రంజితను వ్యతిరేకిస్తుండడం నిత్యానందకు తలనొప్పిగా మారిందట! ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి రంజిత నిత్యానందతో పోటీపడేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఆ వీడియోలను కైలాస దేశం వెబ్‌సైట్‌లో పెట్టేవారు. శిష్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆమె ఆధ్యాత్మిక ప్రసంగాల వీడియోలను ఆపేశారు.