Most Educated Country : ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు ఉన్న దేశం ఏది తెలుసా? పేరు వింటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది నిజం!
అత్యధిక విద్యావంతులైన దేశాల(Eductaed country) జాబితాలో యునైటెడ్ స్టేట్స్(USA) లేదా యునైటెడ్ కింగ్‌డమ్(UK) అగ్రస్థానంలో ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.
అత్యధిక విద్యావంతులైన దేశాల(Eductaed country) జాబితాలో యునైటెడ్ స్టేట్స్(USA) లేదా యునైటెడ్ కింగ్‌డమ్(UK) అగ్రస్థానంలో ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ఈ దేశాలు నిజానికి అధిక విద్యావంతులైన జనాభాను కలిగి ఉన్నప్పటికీ.. వాటికంటే అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాలు ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) నివేదిక ప్రకారం, కెనడా ప్రపంచంలోనే అత్యంత విద్యావంతులైన దేశం. కెనడా(Canada) జనాభాలో 59.96% మంది అత్యధిక విద్యావంతులు ఉన్నారు. ఈ జాబితాలో జపాన్(Japan) రెండో స్థానంలో ఉంది, జనాభాలో 52.68% విద్యావంతులు. లక్సెంబర్గ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణ కొరియా కూడా యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించి, 4వ స్థానాన్ని పొందగా, ఇజ్రాయెల్(Israel) 5వ స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ వరుసగా 6వ, 8వ స్థానాల్లో ఉన్నాయి. ఇది నిరాశాజనకంగా అనిపించినప్పటికీ, ప్రపంచంలోని అత్యధిక విద్యావంతులైన టాప్ 10 దేశాలలో భారతదేశానికి చోటు దక్కించుకోలేదు. కాబట్టి, OECD నివేదిక ప్రకారం భారతీయ జనాభాలో కేవలం 20.4% మంది మాత్రమే కళాశాల, విశ్వవిద్యాలయం లేదా వృత్తి విద్యలో కోర్సులను పూర్తి చేశారు.