మన దేశంలో వివాహాన్ని(Marriage) పవిత్రమైన బంధంగా చూస్తారు. పెళ్లి ఓ సామాజిక బాధ్యతగా భావిస్తారు. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచిన జంటకు జీవితాంతం కలిసే ఉండాలంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు. కలకాలం కలిసిమెలిసి జీవించాలని దంపతులు కూడా ప్రమాణం చేసుకుంటారు. చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోతారు. పెళ్లయ్యాక తమ భాగస్వామితో తప్ప మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు.

మన దేశంలో వివాహాన్ని(Marriage) పవిత్రమైన బంధంగా చూస్తారు. పెళ్లి ఓ సామాజిక బాధ్యతగా భావిస్తారు. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచిన జంటకు జీవితాంతం కలిసే ఉండాలంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు. కలకాలం కలిసిమెలిసి జీవించాలని దంపతులు కూడా ప్రమాణం చేసుకుంటారు. చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోతారు. పెళ్లయ్యాక తమ భాగస్వామితో తప్ప మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మన దగ్గర కూడా విదేశీ సంస్కృతి వ్యాపిస్తోంది. పెళ్లయిన వారు కూడా ఇతరుల పట్ల ఆకర్షితులవుతున్నారని ఓ సర్వేలో(Survey) తేలింది. ఇందులో సహజంగానే పురుషులదే(Men) పెద్ద పీట. చక్కటి భార్య ఉన్నా బయట పరాయి పడచుతో సంబంధాలు(Extra Marital affair) పెట్టుకోవడానికి తహతహలాడుతున్నారు. వివాహ వ్యవస్థలో మార్పులను తెలుసుకోవడానికి ప్రముఖ డేటింగ్ యాకప్‌(Dating App) గ్లిడెన్‌ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. వివాహబంధంలో పర్సనల్ లైఫ్‌ అంతగా బాగోలేదని 60 శాతానికి పైగా జంటలు నిర్మోహమాటగా చెప్పాయట! వీరిలో చాలా మంది డేటింగ్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారట! ఎక్కువ శాతం మంది పెళ్లియన పురుషులు భార్య కాకుండా మరొకరితో డేటింగ్‌ చేయాలని భావిస్తున్నారట! సహజీవనం చేస్తున్న వారిలోనూ ఇదే పరిస్థితి ఉందట! డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో దాదాపు 46 శాతం పెళ్లయిన మగవాళ్లకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలింది. ఇక మహిళల విషయానికి వస్తే 33 నుంచి 35 శాతం మందిలో తమ భాగస్వామితో కలిసి ఉంటూనే మరొకరితో సంబంధం పెట్టుకోవాలనే ఆకాంక్ష ఉన్నదట!

Updated On 15 March 2024 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story