4 Day Week Global : ఇకపై వారానికి నాలుగురోజులే పని..!
కరోనా(Corona) నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ఇకపై వర్క్ ఫ్రం హోంకు(Work from home) స్వస్తి పలకాలని కంపెనీలు భావిస్తున్నాయి.
పని రోజులను మార్చడంతో మంచి ఫలితాలు వస్తాయని నివేదికలు చెప్తున్నాయి.
కరోనా(Corona) నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ఇకపై వర్క్ ఫ్రం హోంకు(Work from home) స్వస్తి పలకాలని కంపెనీలు భావిస్తున్నాయి.
పని రోజులను మార్చడంతో మంచి ఫలితాలు వస్తాయని నివేదికలు చెప్తున్నాయి. దీంతో కొన్ని జర్మన్ కంపెనీలు(German company) పని రోజులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారానికి 4 రోజుల పని అమలులోకి తెస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచనలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాయి.
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమై 6 నెలల పాటు కొనసాగనుంది. 45 కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన 4డే వీక్ గ్లోబల్(4 day week global) అనే స్వచ్ఛంద సంస్థ ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఉద్యోగులు వారానికి కొన్ని గంటలే పని చేయాల్సి ఉంటుంది. జీతం మాత్రం పూర్తిగా చెల్లిస్తారు. కానీ ఫలితాలు మారకూడదు. పని ఫలితాలు గతంలో మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని నిర్ణయించారు. దీంతో పనితీరు మెరుగవడంతో పాటు ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. సెలవులు తీసుకోవడం కూడా ఉద్యోగులు తక్కువగా తీసుకుంటారని ఈ 4 డే వీక్ అధ్యయనం చెప్తోంది.
ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ నివేదిక ప్రకారం ఒత్తిడి(Pressure) అధికంగా ఉన్నఉద్యోగులు పనిలో ఏకాగ్రత చూపకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 ట్రిలియన్ యూరోలు కోల్పోతాయని పేర్కొంది. ఇలాంటి ప్రయోగాలు గతంలో కెనడా, అమెరికా, బ్రిటన్, పోర్చుగల్ దేశాల్లో చేసినట్లు 4డేస్ వీక్ గ్లోబల్ పేర్కొంది. దీంతో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉన్నట్లు తెలిపింది. జర్మనీలోనూ ఇటువంటి ఫలితాలే వస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. నాలుగు రోజుల పని దినాలపై గతంలో బెల్జియం కూడా ప్రయోగాలు చేసింది. జపాన్ కంపెనీలు కూడా ఈ ప్రయోగాలపై అధ్యయనం చేసి అమలుచేయాలని చూస్తున్నాయి. అయితే వారానికి 4 రోజుల పనిదినాల అమలుపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ దేశ ఆర్థికశాఖ అంచనాలు వేస్తోంది.