Births and Deaths: 2024లో సెకన్‌కు 4 జనననాలు..!
అమెరికాకు (America) చెందిన జనగణనశాఖ తాజాగా ఓ నివేదిక విడుదలైంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా సెకన్‌కు నలుగురు చొప్పున అంటే నిమిషానికి 24 మంది పుడతారని (Births) ఈ నివేదిక అంచనా వేసింది.
అమెరికాకు (America) చెందిన జనగణనశాఖ తాజాగా ఓ నివేదిక విడుదలైంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా సెకన్‌కు నలుగురు చొప్పున అంటే నిమిషానికి 24 మంది పుడతారని (Births) ఈ నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో సెకనుకు రెండు మరణాలు (Deaths) సంభవించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల అదుపులో ఉన్నప్పటికీ.. కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని తేల్చింది. కొన్ని దేశాల్లో జనాభా పెరిగితే ఆహారం, నీటి కోరతలు ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక చెప్పింది.
2024 జనవరి నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లను దాటేస్తుంది. అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే (Bharath) 140 కోట్ల జనాభా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల వరకు ఉంది. 2024 జనవరి 1 నాటికి ఇది 800 కోట్లను అధిగమిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయి. దీని ప్రకారం నిమిషానికి 24 మంది పుడితే.. అదేసమయంలో 12 మంది మృతి చెందుతారు. ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల మంది జన్మించారు. 2024 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33.58 కోట్లకు చేరుతుంది.