Earthquake : ఉత్తర చిలీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఉత్తర చిలీలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే భూకంపం ధాటికి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన తక్షణ నివేదికలు లేవు.
ఉత్తర చిలీ(Northern Chile)లో 6.2 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. అయితే భూకంపం ధాటికి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన తక్షణ నివేదికలు లేవు. U.S. జియోలాజికల్ సర్వే(U.S. Geological Survey) ప్రకారం.. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం 20:48 (00:48 GMT)కి నమోదైంది. భూకంప కేంద్రం చిలీలోని కోక్వింబోకు నైరుతి దిశకు 41 కిలోమీటర్లు (25 మైళ్ళు) దూరంలో.. 25 మైళ్ల లోతులో ఉంది. చిలీ జాతీయ అత్యవసర కార్యాలయం(Chile's national emergency office) కూడా ఎటువంటి నష్టాలు లేదా గాయాలను నివేదించలేదు. చిలీ పసిఫిక్(Pacific)లోని "రింగ్ ఆఫ్ ఫైర్(Ring of Fire)" అని పిలవబడే ప్రాంతంలో ఉంది. తరచుగా అక్కడ భూకంపాలు(Earthquakes) వస్తాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఆ తర్వాత వచ్చిన సునామీ(Tsunami) వల్ల 526 మంది ప్రాణాలు కోల్పోయారు.