గొప్ప గొప్ప నాయకుల మీద లేనిపోనివన్నీచెప్పేసి చోద్యం చూడటం ఇటీవల కాలంలో రివాజుగా మారింది. మహాత్మాగాంధీపై వాట్సప్‌ యూనివర్సిటీ ఎంత విషం కక్కుతున్నదో మనం చూస్తూనే ఉన్నాం.

గొప్ప గొప్ప నాయకుల మీద లేనిపోనివన్నీచెప్పేసి చోద్యం చూడటం ఇటీవల కాలంలో రివాజుగా మారింది. మహాత్మాగాంధీ(Mahatma Gandhi)పై వాట్సప్‌ యూనివర్సిటీWhatsApp University) ఎంత విషం కక్కుతున్నదో మనం చూస్తూనే ఉన్నాం. అమెరికావాళ్లేం తక్కువ కాదు. తమ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌(Abraham Lincoln) గురించి ఇప్పుడు ఓ విషయం చెబుతున్నారు. లింకన్‌ స్వలింగ సంపర్కుడన్నది(Homosexuality)వారి వాదన. లవర్‌ ఆఫ్‌ మెన్‌ : ది అన్‌టోల్డ్‌ హిస్టరీ ఆఫ్‌ అబ్రహం లింకన్‌ (Lover of Men : The Untold History of Abraham Lincoln)పేరుతో రూపొందించిన డ్యాకుమెంటరీలో ఈ విషయం వెల్లడయ్యింది. పురుషులతో లింకన్‌ రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ గురించి ఇందులో వివరించారు. ప్రముఖ లింకన్‌ స్కాలర్స్‌ చెప్పిన విషయాలు, ఇప్పటి వరకు బయటపడని ఫొటోలు, లేఖలు వంటివాటి ఆధారంగా ఈ డ్యాకుమెంటరీని రూపొందించారు. హార్వర్డ్‌, కొలంబియా తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన చరిత్రకారుల ఇంటర్వ్యూలను కూడా ఈ డ్యాకుమెంటరీలో పొందరుపరిచారు. సెక్సువల్‌ రూల్స్ గట్రాలు 19 శతాబ్దంలో ఎలా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటిమధ్య తేడాలేమిటి? వంటి అంశాలను ఇందులో వివరించారు.

Eha Tv

Eha Tv

Next Story