Heavy Stroms In america : భీకర తుఫాన్‌తో వణికిపోతున్న అగ్రదేశం అమెరికా .. చీకట్లో మగ్గుతోన్న పది రాష్ట్రాలు
అగ్రదేశం అమెరికా(America) భీకర తుఫాన్‌తో(stroms) వణికిపోతోంది. తూర్పు తీర రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. బలమైన గాలులు(strong Wind), భారీ వర్షాలు(Heavy Rains) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యుత్(Electricity) వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. టెన్నెస్సీ(Tennessee) నుంచి న్యూయార్క్ (New York)వరకు పది రాష్ట్రాలు చీకట్లో మగ్గుతున్నాయ. సుమారు 11 లక్షల ఇళ్లల్లో కరెంట్ కట్టయ్యింది.

Heavy Stroms In america
అగ్రదేశం అమెరికా(America) భీకర తుఫాన్‌తో(stroms) వణికిపోతోంది. తూర్పు తీర రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. బలమైన గాలులు(strong Wind), భారీ వర్షాలు(Heavy Rains) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యుత్(Electricity) వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. టెన్నెస్సీ(Tennessee) నుంచి న్యూయార్క్ (New York)వరకు పది రాష్ట్రాలు చీకట్లో మగ్గుతున్నాయ. సుమారు 11 లక్షల ఇళ్లల్లో కరెంట్ కట్టయ్యింది. విద్యుత్ లైన్లను మరమ్మతు చేయడానికి కొన్ని రోజులు పట్టవచ్చని నాక్స్‌విల్లె యుటిలిటీ బోర్డు తెలిపింది. సుమారు మూడు కోట్ల మందిపై తుఫాన్ ఎఫెక్ట్ పడింది. అలబామాలోని ఫ్లోరెన్స్‌లో సోమవారం పిడుగుపడి ఓ వ్యక్తి మరణించాడు. సౌత్ కరోలినాలోని అండెర్సన్ కౌంటీలో చెట్టుకూలి ఓ బాలుడు చనిపోయాడు. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించాయి. ఎనిమిది వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. సుమారు రెండున్నర విమాన సర్వీసులు రద్దయ్యాయి. వందలాదిగా ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. అనేక చెట్లు నేల కూలాయి.
