Defamation Case On Apple: రాసలీలలను బయటపెట్టిన ఐఫోన్, విడాకులిచ్చిన భార్య
ఇంగ్లాండ్(England) దేశంలో యాపిల్(Apple company) కంపెనీపై పరువునష్టం కేసు(defamation case) వేశాడో వ్యక్తి. అతనికి భార్య ఉంది.
ఇంగ్లాండ్(England) దేశంలో యాపిల్(Apple company) కంపెనీపై పరువునష్టం కేసు(defamation case) వేశాడో వ్యక్తి. అతనికి భార్య ఉంది. అయితే పొరుగింటి పుల్ల కూర రుచిగా ఉంటుందన్న సామెత నచ్చిందేమో సెక్స్ వర్కర్లతో(Sex worker) రాసలీలలు జరిపాడు. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు తన ప్రియురాలితో చేసిన చాట్‌ను డిలీట్ చేశాడు. అయినా కానీ తన మెసేజ్‌లు భార్యకు కనపడ్డాయి. భర్త రాసలీలలు బయటపడడంతో అతనికి విడాకులిచ్చింది. యాపిల్ ఫోన్ వల్లే తాన మెసేజ్‌లను భార్య చూసిందని ఆ కంపెనీపై పరువునష్టం దావా వేశాడు. రూ.53 కోట్లు చెల్లించాలని పిటిషన్ వేశాడు.
లండన్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్(I Message App) నుంచి సెక్స్‌వర్కర్లతో చాటింగ్ చేశాడు. తన భార్యకు ఈ విషయం తెలియకూడదని తన చాటింగ్‌ను డిలీట్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఈ యాపిల్ ఐడీని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లో కూడా ఉపయోగించాడు. అయితే ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ అయ్యాయి కానీ ఐమ్యాక్‌లో డిలీట్ కాలేదు. ఓ రోజు వాటిని చూసిన భార్య ఈ వ్యక్తితో విడాకులు తీసుకుంది. దీంతో యాపిల్ కంపెనీ వల్లే తన జీవితం నాశనమందని ఆ కంపెనీపై పరువునష్టం దావా వేశాడు. ఈ సందర్భంగా తను వేసిన పిటిషన్‌లో రాస్తూ 'ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేస్తే అవి పోయాయి, కానీ యాపిల్ ఐడీ లింక్ చేసిన మిగతా డివైజ్‌లలో ఉండిపోతాయన్న సందేశాన్ని యాపిల్ కంపెనీ తమ కస్టమర్లకు చేరవేయకపోవడం వల్లే ఇలా జరిగిందని వాపోయాడు. తన ఫోన్‌లో డిలీట్ అయ్యి మరో డివైజ్‌లో మెసేజెస్ డిలీట్ కాకపోవడంతో అవి చూసిన తన భార్య విడాకులిచ్చిందని దీని వల్ల 5 మిలియన్ పౌండ్లు నష్టపోయాయనని పిటిషన్‌లో పేర్కొన్నాడు. యాపిల్ కంపెనీ వల్ల భార్యకు సర్దిచెప్పుకోలేకపోయానని, ఇందుకుగా 5 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.53 కోట్లు చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేయగా త్వరలోనే కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.