భరించలేనంత విషాదవార్త విన్నప్పుడు గుండె తట్టుకోలేదు. అందుకే ఇలాంటి వార్తలను చాలా జాగ్రత్తగా చెబుతుంటారు.

భరించలేనంత విషాదవార్త విన్నప్పుడు గుండె తట్టుకోలేదు. అందుకే ఇలాంటి వార్తలను చాలా జాగ్రత్తగా చెబుతుంటారు. సరే, మరి ఆనందకరమైన వార్తలు వింటేనో అంటే అలాంటివి కూడా ముందూ వెనుకా చూసి చెప్పాలి. పట్టరాని ఆనందాన్ని కూడా గుండె తట్టుకోలేదు. నిజమేనా అంటే సింగపూర్‌(Singapore)లోని మారినా ఏ స్టాండ్స్‌ క్యాసినోలో ఇలాంటి ఘటనే జరిగింది మరి! లాస్‌ వెగాస్‌కు చెందిన గేమింగ్‌ అండ్‌ రిసార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఐకానిక్‌ క్యాసినోలో అతడు దాదాపు 33 కోట్ల రూపాయలను గెల్చుకున్నాడు. నాలుగు బిలియన్‌ డాలర్లన్నమాట! ఎప్పుడూ నష్టపోయే అతడు ఈ విషయాన్ని నమ్మలేదు. నిజమేనని తెలిసిన తర్వాత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇంత ఆనందకరమైన వార్త విని ఆ గుండె కొట్టుకోవడం మానేసింది. ఆ ఆనందంలోనే కుప్పకూలిపోయాడతడు. క్యాసినో నిర్వాహకులు వెంటనే అతడికి తక్షణ వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

Updated On 26 Jun 2024 11:12 AM GMT
Eha Tv

Eha Tv

Next Story