వర్షంలో తడవనివారు ఉంటారేమో కానీ, వనితను చూడని మనిషంటూ ఎవరైనా ఉంటారా ఈ భూమ్మీద!

వర్షంలో తడవనివారు ఉంటారేమో కానీ, వనితను చూడని మనిషంటూ ఎవరైనా ఉంటారా ఈ భూమ్మీద! తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవర్నో ఒకర్ని చూస్తారు. సన్యాసం పుచ్చుకున్నవారు కూడా స్త్రీని చూసే ఉంటారు. బాల్యంలో ఉన్నప్పుడు తల్లినో, అక్కనో, నానమ్మనో, అమ్మమ్మనో, మేనత్తనో చూస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడలేదు. అతడి పేరు మిహైలో టొలటోస్‌(Mihailo Tolotos). గ్రీస్‌(Greek)కు చెందిన ఈ వ్యక్తి 1856లో జన్మించాడు. పుట్టిన నాలుగు గంటలకే తల్లి చనిపోయింది. ఆ పసికూనను పెంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జాలి, కనికరం, దయ అన్నది లేని బంధుగణం ఆ బాబును మౌంట్‌ అతోస్‌ అనే పర్వతంపైన ఉన్న ఆశ్రమం మెట్లపై వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమవాసులు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. మిహైలో టొలటోస్‌ అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు.

మిహైలో బాల్యమంతా ఆ ఆశ్రమంలోనే సాగింది. అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఆశ్రమంలో మోక్స్‌ అవటోన్‌ అనే నిబంధనను అనుసరిస్తారు. ఈ నియమం ప్రకారం మౌంట్‌ అథోస్‌ పర్వతంపైకి మహిళలకు ఎంట్రీ లేదు. అందుకే ఆయన తన జీవితకాలంలో స్త్రీని చూడలేదు. చనిపోయేవరకు ఆధ్యాత్మిక మార్గంలోనే నడిచారు. 1938లో తన 82వ ఏట కన్నుమూశాడు. ఆ విధంగా జీవితంలో స్త్రీని చూడని ఏకైక వ్యక్తిగా మిహైలో నిలిచిపోయాడు. చిత్రమేమిటంటే అథోస్‌ పర్వతాల దగ్గర ఆడ జంతువులు కూడా కనిపించవట! పాలిచ్చే జంతువులు కానీ, గుడ్లు పెట్టే పక్షులు కానీ ఉండవట! ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే ప్రమీల రాజ్యానికి కంప్లీట్‌ రివర్స్‌ అన్నమాట!

ehatv

ehatv

Next Story