Attack In Rafa : గాజాలో ఆగని ఇజ్రాయెల్ దాడులు.. భారతీయుడు మృతి
హమాస్(Hamas) బలగాలను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పిన ఇజ్రాయెల్(Israel) ఇప్పుడు అమాయకపౌరులపై కూడా దాడలు చేస్తోంది. తాజాగా గాజాలోని రఫా(Rapha) నగరంపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పని చేసే ఓ భారతీయుడు(Indian) కూడా చనిపోయాడు. తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు వెళుతున్నప్పుడు ఒక్కసారిగా దాడి జరగడంతో అతడు మరణించాడు.
హమాస్(Hamas) బలగాలను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పిన ఇజ్రాయెల్(Israel) ఇప్పుడు అమాయకపౌరులపై కూడా దాడలు చేస్తోంది. తాజాగా గాజాలోని రఫా(Rapha) నగరంపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పని చేసే ఓ భారతీయుడు(Indian) కూడా చనిపోయాడు. తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు వెళుతున్నప్పుడు ఒక్కసారిగా దాడి జరగడంతో అతడు మరణించాడు. ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యక్తి మరణించడం ఇదే మొదలు! చనిపోయిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన వ్యక్తి. అతడు భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడు. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్(Farhan Haq) తీవ్రంగా ఖండించారు. యుఎన్‌ఓ(UNO) సిబ్బందిపై జరిగిన దాడులపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. డిఎస్‌ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యుఎన్‌ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేశారు.