Flesh Eating Bacteria : 48 గంటలలో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా పుట్టుకొచ్చింది...!
కోవిడ్ వైరస్(Covid virus) చేసిన విధ్వంసం నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సమయంలో మరో బ్యాక్టీరియా(Bacteria) ప్రపంచాన్ని వణికిస్తోంది.
కోవిడ్ వైరస్(Covid virus) చేసిన విధ్వంసం నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సమయంలో మరో బ్యాక్టీరియా(Bacteria) ప్రపంచాన్ని వణికిస్తోంది. అది మామూలు వైరస్ కాదు.. కేవలం 48 గంటలలో ప్రాణాలు తీసేస్తుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జపాన్‌లో(Japan) వెలుగు చూసింది. ఇప్పటికే ఈ బ్యాక్టీరియా బారిన పడి వెయ్యి మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రాణాలను తీసే ఈ ఇన్ఫెక్షన్‌ను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన మనిషికి ఉదయాన్నే పాదాలు వాస్తాయి. మధ్యాహ్నానికి అది మోకాలి ప్రాంతానికి చేరుకుంటుంది. తర్వాత శరీరమంతటా పాకుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) చెబుతున్న ప్రకారం యూరప్‌లోని మరో అయిదు దేశాలలో కూడా ఈ బ్యాక్టీరియాను గుర్తించారట! ఈ ఏడాది జపాన్‌లో రెండున్నర వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో ౩౦ శాతం మంది చనిపోయారు. ఈ బ్యాక్టీరియా సోకితే చేతులు, కాళ్లలో నొప్పి పుడుతుంది. వాపు, జ్వరం, రక్తపోటు మొదలైనవి వస్తాయి. ఇన్ఫెక్షన్ పెరిగిన కొద్దీ శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. చివరకు ప్రాణం పోతుంది. 50 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ప్రభావానికి గురవుతున్నారు.