Destination Wedding At Risk : పెంపుడు కుక్క చేసిన పనికి నెత్తినోరు బాదుకుంటున్న వరుడు...
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడానికి చాలా కారణాలుంటాయి. కట్నకానుకల దగ్గర పేచీలు రావడమో, అమ్మాయికి అబ్బాయి నచ్చకపోవడమో ఇలా అనేకానేక కారణాలుంటాయి. కానీ ఓ పెంపుడు కుక్క(Pet Dog) కారణంగా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడమన్నది ఎప్పుడైనా విన్నారా? భలేవారే .. ఇలాంటిది కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోకండి.. అమెరికాలో ఇదే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న పెళ్లికుమారుడికి పెంపుడు శునకం పెద్ద షాకిచ్చింది.
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడానికి చాలా కారణాలుంటాయి. కట్నకానుకల దగ్గర పేచీలు రావడమో, అమ్మాయికి అబ్బాయి నచ్చకపోవడమో ఇలా అనేకానేక కారణాలుంటాయి. కానీ ఓ పెంపుడు కుక్క(Pet Dog) కారణంగా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడమన్నది ఎప్పుడైనా విన్నారా? భలేవారే .. ఇలాంటిది కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోకండి.. అమెరికాలో ఇదే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న పెళ్లికుమారుడికి పెంపుడు శునకం పెద్ద షాకిచ్చింది. ఒకప్పుడైతే పెళ్లి కూతురు ఊళ్లోనే పెళ్లి జరిగేది. ఇప్పుడు దగ్గరున్న పట్టణాల్లోని ఫంక్షన్ హాల్‌లో జరుపుతున్నారు. బాగా డబ్బున్న వారు మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి దగ్గరవాళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతికి పెళ్లి కుదరింది. గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడానికి వధూవరులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు.
పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో పాటు పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకున్నారు. ఫ్లయిట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. చిన్నా చితకా పెళ్లి పనులు మిగిలి ఉండటంతో వాటిని కూడా పూర్తి చేసుకోవడానికి వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్టును(Passport) కరకరమంటూ నమిలేసి మింగేసింది. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పాస్‌పోర్టు లేకపోతే ఏం చేయాలో పాలుపోలేదతడికి! వెంటనే స్థానిక అధికారుల దగ్గరకు వెళ్లారు. ఆగస్టు 31న ఇటలీలో తన పెళ్లి ఉందని, తన పాస్‌పోర్టును కుక్క మింగేసిందని, ఏదో ఒక మార్గం చూపించాలని వేడుకున్నాడు. తనను వదిలేసి పెళ్లి కూతురుతో పాటు బంధుమిత్రులంతా ఇటలీకి వెళ్లిపోతారని దీనంగా మొరపెట్టుకున్నాడు. పెళ్లికొడుకు పరిస్థితి చూసి అధికారులకు జాలి కలిగింది. ఏదో ఒకటి చూద్దాంలే అని మాటిచ్చి పంపించేశారు. అధికారులు మాట నిలుపుకుంటారా? ప్రత్యామ్నాయం ఏమైనా చూపిస్తారా? ఆగస్టు 31న పెళ్లి జరుగుతుందా? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!