ఇటలీలోని(Italy) మిలన్‌(Millan) నగరంలో భారీ పేలుడు(Blast) సంభవించింది. పార్క్‌ చేసిన కారులో పేలుడు చోటు చేసుకోవడంతో జనం భయభ్రాంతులయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లు(car) కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

ఇటలీలోని(Italy) మిలన్‌(Milan) నగరంలో భారీ పేలుడు(Blast) సంభవించింది. పార్క్‌ చేసిన కారులో పేలుడు చోటు చేసుకోవడంతో జనం భయభ్రాంతులయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లు(car) కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అయిదారు వాహనాలు పూర్తిగా తగలబడిపోయాయి. గ్యాస్‌ సిలిండర్లు తరలిస్తున్న వాహనంలో పేలుడు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. ప్రమాద స్థలంలోనే పాఠశాల, నర్సింగ్‌ హోం ఉన్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 11 May 2023 6:20 AM
Ehatv

Ehatv

Next Story