అతడి వయసు 35 ఏళ్లు.. ఆమె వయసు 70 ఏళ్లు.. ఇద్దరూ ఇష్టపడ్డారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనువులు కుదుర్చుకున్నారు. జీవితాంతం కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికొడుకు పేరు నయీమ్‌ షాజద్‌(Naeem Shahzad).పాకిస్తాన్‌కు(Pakistan) చెందినవాడు. వధువేమో 70 ఏళ్ల మేరీ(Merry). ఈమె కెనడియన్‌(Canadian). వీరి ప్రేమను, పెళ్లిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వీసా కోసమే మేరిని నయీమ్‌ పెళ్లి సుకున్నాడని ఆరోపిస్తున్నారు.

అతడి వయసు 35 ఏళ్లు.. ఆమె వయసు 70 ఏళ్లు.. ఇద్దరూ ఇష్టపడ్డారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనువులు కుదుర్చుకున్నారు. జీవితాంతం కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికొడుకు పేరు నయీమ్‌ షాజద్‌(Naeem Shahzad).పాకిస్తాన్‌కు(Pakistan) చెందినవాడు. వధువేమో 70 ఏళ్ల మేరీ(Merry). ఈమె కెనడియన్‌(Canadian). వీరి ప్రేమను, పెళ్లిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వీసా కోసమే మేరిని నయీమ్‌ పెళ్లి సుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను దంపతులు కొట్టేస్తున్నారు.వీరిద్దరికి 2012లో ఫేమ్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. మూడేళ్లపాటు ఇద్దరూ ఫేస్‌బుక్‌తో ముచ్చటించుకున్నారు. 2015లో నయీమ్‌కు మేరీనే పెళ్లి ప్రపోజ్‌ చేసింది. 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.నయీమ్‌కు వీసా రాకపోవడంతో కెనడాలో కలిసి జీవించలేకపోయారు.

అందుకే మేరీనే పాకిస్తాన్‌కు వెళ్లింది. నయీమ్‌ దగ్గర ఆరు నెలల పాటు ఉంది. గతంలో నయీం ఆర్ధిక సమస్యలు అధికంగా ఉండేవి. ఆ కారణంగా అతడు మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. ఈ సమయంలో మేరీ అతడికి చేయూతనందించింది. ఆర్ధికంగా సాయం చేయడమే కాకుండా మానసిక ధైర్యాన్ని అందించింది. అలాగని మేరీ బాగా డబ్బున్నావిడేమీ కాదు. పెన్షన్‌తో జీవితాన్ని నెట్టుకొచ్చే మామూలు మహిళ. కెనడా వెళ్లేందుకే, డబ్బు కోసమే మేరీని నయీమ్‌ పెళ్లి చేసుకున్నాడని స్థానికులు అంటుంటారు. ఇలాంటి వాటిని తాను అసలు పట్టించుకోనని, తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మేరీ ఎంతో సాయం చేసిందని, అందుకే తాను ఆమె ప్రేమలో పడ్డానని నయీమ్ అన్నాడు.

Updated On 21 Sep 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story