Thailand : సిక్ లీవ్ ఇవ్వని మేనేజర్.. ఆఫీస్కొచ్చిన అరగంటకే మహిళా ఉద్యోగి మృతి
థాయ్‌లాండ్‌లోని(Thailand) డెల్టా ఎలక్ట్రానిక్స్‌లో(Delta Electronics) 30 ఏళ్ల మహిళా కార్మికురాలు మేనేజర్ సిక్ లీవ్(Sick leave) ఇవ్వకపోవడంతో మరణించింది.

థాయ్‌లాండ్‌లోని(Thailand) డెల్టా ఎలక్ట్రానిక్స్‌లో(Delta Electronics) 30 ఏళ్ల మహిళా కార్మికురాలు మేనేజర్ సిక్ లీవ్(Sick leave) ఇవ్వకపోవడంతో మరణించింది. పెద్దప్రేగు మంటతో ఆసుపత్రిలో చేరిన ఆమె తిరిగి పనిలోకి వచ్చిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై కంపెనీ విచారం వ్యక్తం చేసి దర్యాప్తు ప్రారంభించింది. సముత్ ప్రకాన్ ప్రావిన్స్‌లోని డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మే అనే ఉద్యోగి, పెద్ద పేగు మంట కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆమె అస్వస్థతకు గురైంది. అయితే ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె తిరిగి విధుల్లో చేరాల్సి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో, మే మరొక సిక్ లీవ్ ఇవ్వాలని మేనేజర్ కోరగా అందుకు అతను నిరాకరించాడు.
మే మరుసటి రోజు డ్యూటీకి వచ్చిన తర్వాత కేవలం 20 నిమిషాల తర్వాత కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు.
అప్పటికే ఆమె మృతి చెందింది. దీనిపై విచారం విచారం వ్యక్తం చేస్తున్నట్లు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది
