Skyscraper Demolision : క్షణాల్లో 22 అంతస్థుల భవంతి నేలమట్టం!
నిర్మాణం కష్టం కానీ కూల్చివేతలు చాలా సులభం! ఇప్పుడు ఎంత పెద్ద భవంతినైనా ఈజీగా కూల్చేస్తున్నారు.
నిర్మాణం కష్టం కానీ కూల్చివేతలు చాలా సులభం! ఇప్పుడు ఎంత పెద్ద భవంతినైనా ఈజీగా కూల్చేస్తున్నారు. అమెరికాలోని లూసియానా(Louisiana) రాష్ట్రంలో ఉన్న లేక్ చార్లెస్‌లోని(Lake Charles) హెర్జ్ టవర్‌ను క్షణాల్లో కూల్చేశారు(Skyscraper Imploded). 22 అంతస్థుల ఆ బిల్డింగ్ చూస్తుండగానే నేలమట్టం అయ్యింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేలుడు పదార్ధాలతో(Explosion) ఆ భవంతిని పేల్చేశారు. బిల్డింగ్‌ను కూల్చేసిన తర్వాత ఆ భవంతికి చెందిన శిథిలాలు సుమారు అయిదు అంతస్తుల ఎత్తు వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన లౌరా, డెల్టా హరికేన్ల కారణంగా ఆ భవంతి ధ్వంసమయ్యింది. క్యాపిటల్ వన్ టవర్‌గా ఫేమస్ అయిన ఆ బిల్డింగ్.. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా స్థానికులకు తెలుసు. 2020లో హరికేన్ల రాకతో లూసియానాలో భారీ నష్టం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ కూడా ఆ నాటి హరికేన్ ధాటికి దెబ్బతిన్నది. కిటికీలు పగిలిపోయాయి. ఆ బిల్డింగ్‌కు మరమ్మతులు చేసేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి కోర్టు కేసు ద్వారా పేల్చేశారు. ఆ బిల్డింగ్ యజమాని లాస్ ఏంజిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హెర్జ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు. 167 మిలియన్ల డాలర్లతో మళ్లీ ఆ బిల్డింగ్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యిందా గ్రూపు. బిల్డింగ్ పేల్చివేతకే దాదాపు ఏడు మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యిందట!