Train Derailment For Reels : రీల్స్ పిచ్చితో రైలును పట్టాలు తప్పించాడు...!
సోషల్ మీడియాలో(social Media) పాపులరవ్వడానికి అడ్డమైన రీల్స్ చేస్తున్నారు యువతీ యువకులు.
సోషల్ మీడియాలో(social Media) పాపులరవ్వడానికి అడ్డమైన రీల్స్ చేస్తున్నారు యువతీ యువకులు. అదో దుర్వ్యసనంలా తయారయ్యింది. కొందిరికి పిచ్చి పీక్స్‌లోకి వెళ్లింది. ప్రాణాలు కూడా పొగొట్టుకునేంత పిచ్చి! ఇలాగే అమెరికాలో(America) ఓ కుర్రోడికి రీల్స్(Reels) కోసం ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు(train derailment). అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు కానీ, నష్టం మాత్రం భారీగానే ఏర్పడింది. నెబ్రస్కా(Nebraska)స్టేట్‌లోని లాంక్సటార్ కౌంటీలో ఉంటున్న 17 ఏళ్ల యువకుడికి యూ ట్యూబ్‌లో(Youtube) ఓ వీడియోను వైరల్ చేయాలనుకున్నాడు. మూమూలుగా వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే ఎవరూ చూడరు. అందుకే బాగా ఆలోచించాడు. పోయిన ఏప్రిల్ నెలలో మోన్రోయ్ అనే ప్రాంతం దగ్గర ఉన్న రైలు క్రాసింగ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రైలు మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీశాడు. వాటిల్లో మార్పులు చేశాడు.దగ్గరలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి రెడీగా ఉన్నాడు. కాసేపటికి బీఎన్‌ఎస్‌ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, అయిదు బోగీలు వచ్చాయి. లోకోమోటీవ్ పైలట్ ఏం జరిగిందో గుర్తించేలోపు అవి పట్టాలు తప్పాయి. ఇంతా చేసినా ఆ కుర్రవాడే రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు కీలక స్విచ్‌లను మార్చినట్టు గ్రహించారు. వారికి అనుమానం వచ్చి ఆ బాలుడిని విచారించారు. అతడు పట్టాలు తప్పుతున్న రైలు వీడియో తీసినట్టు చెప్పాడే తప్ప తప్పు ఒప్పుకోలేదు. అధికారులు అక్కడి సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినప్పుడు ఆ బాలుడు చేసిన పని స్పష్టమయ్యింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్‌ఎస్‌ఎఫ్ రైల్వేకు దాదాపు 3,50,000 డాలర్ల నష్టం వాటిల్లింది. మన కరెన్సీలో అది దాదాపు రెండు కోట్ల రూపాయలకుపైనే !