దొంగతనానికి కాదేదీ అనర్హం అన్న విషయం మరోసారి రుజువైంది. కాకపోతే ఇది కాస్ట్లీ వస్తువే సుమా.

దొంగతనానికి కాదేదీ అనర్హం అన్న విషయం మరోసారి రుజువైంది. కాకపోతే ఇది కాస్ట్లీ వస్తువే సుమా. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్‌లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్‌ను కొందరు దొంగలు కేవలం ఐదు నిమిషాల్లోనే ఎత్తుకుపోయారు. 2019లో జరిగిన ఈ చోరీ కేసును బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు విచారించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ కెరీర్‌తో ముడిపడి ఉన్న ఈ బంగారు టాయిలెట్‌ 2019 సెప్టెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్‌లోని ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారు జామున ఇందులోకి ప్రవేశించిన నిందితులు ఐదు నిమిషాల్లో దానిని తీసుకుని వెళ్లిపోయారు పోయారు. అనంతరం పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. అయితే వారి నుంచి ఆర్ట్‌వర్క్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని, దానిని వారు విడగొట్టి అమ్మేసి ఉంటారని వారు భావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ముందస్తు ప్లాన్‌తో ఈ భారీ చోరీకి పాల్పడి ఉంటారని కోర్టు అంగీకరించింది. నిందితులపై దోపిడీ, ఆస్తి బదలాయింపునకు కుట్ర, తదితర ఆరోపణల కింద నమోదు చేశారు.

ehatv

ehatv

Next Story