Goats Released From Jail : ఏడాది జైలు శిక్ష అనుభవించిన మేకలు.. అవి చేసిన తప్పేమిటంటే...!
ఉత్త పుణ్యానికి ఆ మేకలు(Goats) ఏడాదికి పైగా జైలు శిక్ష(jail sentence) అనుభవించాయి. ఆ మేకలు చేసిన పాపమేమిటంటే స్మశాన(Grave yard) వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తినడమే! ఈ మాత్రందానికే జైల్లో వేస్తారా? అంటే వేశారు మరి! ఈ ఇన్సిడెంట్ బంగ్లాదేశలో(Bangladesh) చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కు(Shachib Rajib) చెందిన తొమ్మిది మేకలు లాస్టియర్ డిసెంబర్ 6వ తేదీన స్మశాన వాటికలో దూరి చెట్ల ఆకులు, గడ్డి తినేశాయి. మా పర్మిషన్(Permission) లేకుండా స్మశానంలో దూరడమే కాకుండా ఆకులు అలమలు తింటారా? ఏంత ధైర్యం అని అధికారులు అనేసుకుని ఆ మేకలను అరెస్ట్(Arrest) చేశారు. వాటిని తీసుకెళ్లి బారిసాల్(Barisal) జైల్లో వేశారు.
ఉత్త పుణ్యానికి ఆ మేకలు(Goats) ఏడాదికి పైగా జైలు శిక్ష(jail sentence) అనుభవించాయి. ఆ మేకలు చేసిన పాపమేమిటంటే స్మశాన(Grave yard) వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తినడమే! ఈ మాత్రందానికే జైల్లో వేస్తారా? అంటే వేశారు మరి! ఈ ఇన్సిడెంట్ బంగ్లాదేశలో(Bangladesh) చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కు(Shachib Rajib) చెందిన తొమ్మిది మేకలు లాస్టియర్ డిసెంబర్ 6వ తేదీన స్మశాన వాటికలో దూరి చెట్ల ఆకులు, గడ్డి తినేశాయి. మా పర్మిషన్(Permission) లేకుండా స్మశానంలో దూరడమే కాకుండా ఆకులు అలమలు తింటారా? ఏంత ధైర్యం అని అధికారులు అనేసుకుని ఆ మేకలను అరెస్ట్(Arrest) చేశారు. వాటిని తీసుకెళ్లి బారిసాల్(Barisal) జైల్లో వేశారు. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు నానా పాట్లు పడ్డారు. బెయిల్(Bail) తెచ్చుకుందామనుకుంటే అవి మేకలైపోయాయి! ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మేకలను విడిపించుకోలేకపోయాడు. అయితే ఇటీవల బారిసల్ నగర కార్పొరేషన్‌కు కొత్త మేయర్(Mayor) వచ్చారు. ఆయనను కలిసి తన గోడును వెలిబుచ్చుకున్నాడు. మేయర్‌కు కూడా ఆశ్చర్యమేసింది. అధికారులను పిలిచి సంగతేమిటో చూడమన్నారు. వారు వెంటనే రాజీబ్‌కు చెందిన తొమ్మిది మేకలను విడుదల చేసి అతడికి అప్పగించారు. ఏడాదికి పైగా జైల్లోనే ఉండిన మేకలకు ఇన్నాళ్లకు విముక్తి లభించింది. జంతువులను అరెస్ట్ చేయడమన్నది ఇదేం మొదటిసారి కాదు. రష్యాలో(Russia) కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి(Komi) ప్రావిన్స్‌లో సిక్టివ్‌కర్ నగరంలోని ఓ పిల్లి(Cat) ఫోన్‌లు, గాడ్జెట్‌లు రవాణా చేస్తున్నదని ఓ పిల్లిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కూడా ఇలాంటి వింత ఘటన జరిగింది. ఎనిమిది గాడిదలు(Donkeys) లక్షలు విలువ చేసే మొక్కలను తిన్నాయని చెప్పి వాటిని అరెస్ట్ చేసి జైల్లో తోశారు.