ఈ రోజుల్లో సొంతిల్లు(Own House) అన్నది మధ్య తరగతికి ఓ కల! ఇంటి జాగాకే లక్షలకు లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.
ఈ రోజుల్లో సొంతిల్లు(Own House) అన్నది మధ్య తరగతికి ఓ కల! ఇంటి జాగాకే లక్షలకు లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. సిటీకి అవతల, అల్లంత దూరాన ఉన్న భూముల ధరలు కూడా కొనడానికి వీల్లేనంతగా ఉన్నాయి. వంద గజాలు కొందామన్న గగన కుసుమమే! కానీ ఓ చోట మాత్రం చదరపు మీటర్‌కు ఎనిమిది రూపాయలు మాత్రమే ఉంది. ఓ ఎనిమిది వందల రూపాయలు పెడితే ఇల్లు కట్టుకునేంత జాగా కొనేసుకోవచ్చు. తోట మధ్యలో ఇల్లుకట్టుకుని ఆనందంగా ఉండాలనుకుంటే మాత్రం ఓ ఎనిమిది వేలు పెడితే సరిపోతుంది. కాకపోతే ఇందుకోసం మనం స్వీడన్(Swedan) వరకు వెళ్లాల్సి వుంటుంది. అక్కడ గోటెన్(Goten) నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకాని పెట్టారన్నమాట! స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌కు 321 కిలోమీటర్ల దూరంలో గోటెన్ సిటీ ఉంటుంది. ఈ నగరంలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ జనాభా బాగా తగ్గింది. ఆర్ధిక సమస్యలు కూడా ఎక్కవయ్యాయి. అందుకే హౌజింగ్ మార్కెట్‌కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. ఒక చదరపు మీటర్‌కు ఒక క్రోనా ఇస్తే చాలని సిటీ మేయర్ జోహన్ మాన్సన్ అంటున్నారు. మన కరెన్సీలో ఒక క్రోనా 7.86 రూపాయలన్నమాట!