ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.

ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రేమ అనేది ఓ ఫీలింగ్. ఎవరిపైన ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓ వయస్సు వచ్చిన తర్వాత అమ్మాయిలకి అబ్బాయిలపైన, అబ్బాయిలకి అమ్మాయిలపైన ప్రేమ పుట్టడం అనేది సర్వసాధారణం. ప్రేమ డబ్బు, కులం, మతం, వయసును కోరుకోదంటారు. కొన్ని ప్రేమలు కామాం కోసం పుడితే.. కొన్ని ప్రేమలు మనసులోంచి పుడతాయి. ప్రేమ కోసం ఇంటి వారిని ఎదురిస్తారు, ఒప్పుకోకుంటే లేచిపోతారు. తమ ప్రేమను నిలుపుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అలాంటి ప్రేమలు ఎన్నో చూశాం, చూస్తున్నాం. ఇకపై ప్రేమ వివాహాలే(love Marriage) అధికంగా చూడబోతాం కూడా. ఇలాంటి తరహా ప్రేమ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) చర్చ జరుగుతోంది.

ఒకాయనకు వయసు వచ్చిన తర్వాత ప్రేమ పుట్టలేదు, వయసు అయిపోయినాక ప్రేమ పుట్టింది.. అబ్బా అదేనండీ వయసుపోయాక అంటే 80 ఏళ్ల వయసులో ప్రేమ పుట్టింది. పోనీ 80 ఏళ్ల ముసలాయనకు ఓ 70 ఏళ్ల వయసున్న ముసలామె మీద ప్రేమ పుడితే.. సరే ఓకే ముసలోడు, ముసల్దీ ఈ వయసులో కలిసి ఉంటారేమో అనుకుంటాం. కానీ ముసలోడు మామూలోడు కాదు.. మహానుభావుడు.. ఇతగాడు ప్రేమలో పడింది 23 ఏళ్ల పడుచు పిల్లతో.. అవును మీరు చదివింది నిజమే.. 23 ఏళ్ల యంగ్‌ గర్ల్‌తో లవ్వాట ఆడాడు ముసలోడు..పెళ్లి కూడా చేసుకున్నాడు. చైనాలో(China) ఈ కథ జరిగింది. తాత వయస్సులో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. యువతి తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా వారిని వదిలేసి వచ్చి మరీ ఈయన గారిని పెళ్లాడింది.

వృద్ధాశ్రమంలో(Oldage Home) ప్రేమలో పడి 23 ఏళ్ల జియోన్‌ఫాంగ్ అనే యువతిని 80 ఏళ్ల చైనీస్ వ్యక్తి లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో జరిగింది, అక్కడ వృద్ధాశ్రమంలో పనిచేసిన జియోన్‌ఫాంగ్ అనే అమ్మాయి అక్కడ లీ అనే వృద్ధుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ త్వరగా సన్నిహితులు అయ్యారు, చివరికి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతేకాదు వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె కుటుంబం ఆమె ఈ వివాహానికి అంగీకరించనప్పటికీ పెళ్లి చేసుకుంది. కొత్త జంట 'ప్రేమతో నిండిన' చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి. అంతేకాదు శృంగార భంగిమలతో ఈ 'యువజంట' ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. జియోన్‌ఫాంగ్ -లి శృంగార కథ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. డబ్బు కోసం ఒక వృద్ధుడిని వివాహం చేసుకున్నారని పలువురు విమర్శించినా మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని, లీ ప్రేమను మెచ్చుకున్నారు. కానీ వృద్ధుడి దగ్గర పెద్దగా ఆస్తి పాస్తులు లేవు. తనకు వచ్చే పెన్షన్‌ డబ్బుతో వృద్ధాశ్రమంలో గడుపుతున్నాడు. దీంతో అతనికి ఉన్న ఆస్తులను చూసి ప్రేమించిందని జియోన్‌ఫాంగ్‌పై వచ్చిన ఆరోపణలకూడా నిజం కావని తేటతెల్లమైంది. ఈ సందర్భంగా జియోన్‌ఫాంగ్‌ లీ గురించి చెప్తూ 'నా పక్కన ఉన్న లితో ఏదైనా సాధ్యమేనని' వ్యాఖ్యానించింది.

Eha Tv

Eha Tv

Next Story