అమెరికా మ‌రోమారు కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. టెక్సాస్‌ (Texas) రాష్ట్రంలోని డల్లాస్‌కు ఉత్తరాన ఉన్న బిజీ మాల్‌లో శనివారం ఒక సాయుధుడు కాల్పుల‌తో విధ్వంసానికి దిగడంతో ఎనిమిది మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. కాల్పుల దాటికి వందలాది మంది దుకాణదారులు, ప్ర‌జ‌లు భయాందోళనలతో మాల్ నుండి పారిపోయారు. టెక్సాస్‌లోని అలెన్ ప్రీమియమ్ ఔట్‌లెట్స్ మాల్ వెలుపల దుండ‌గుడు కాల్పులు జరిపాడు.

అమెరికా(America) మ‌రోమారు కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. టెక్సాస్‌ (Texas) రాష్ట్రంలోని డల్లాస్‌(Dallas)కు ఉత్తరాన ఉన్న బిజీ మాల్‌లో శనివారం ఒక సాయుధుడు కాల్పుల‌(Gun Fire)తో విధ్వంసానికి దిగడంతో ఎనిమిది మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. కాల్పుల దాటికి వందలాది మంది దుకాణదారులు, ప్ర‌జ‌లు భయాందోళనలతో మాల్ నుండి పారిపోయారు. టెక్సాస్‌లోని అలెన్ ప్రీమియమ్ ఔట్‌లెట్స్ మాల్ వెలుపల దుండ‌గుడు కాల్పులు జరిపాడు. ఒంటరిగా కాల్పుల‌కు దిగిన ఆ ముష్కరుడిని.. ఒక పోలీసు అధికారి మ‌ట్టుబెట్టాడ‌ని పోలీసు చీఫ్ బ్రియాన్ హార్వే(Briyan Harvey) విలేకరుల సమావేశంలో తెలిపారు.

అలెన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జోన్ బాయ్డ్(Jon Boyd) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తుపాకీ కాల్పుల‌లో గాయప‌డిన తొమ్మిది మంది బాధితులను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లిన‌ట్లు తెలిపారు. మెడికల్ సిటీ హెల్త్‌కేర్(Medical City Healthcare) ప్రతినిధి మాట్లాడుతూ.. గాయపడిన వారి వయస్సు 5 సంవ‌త్స‌రాల నుండి 61 సంవ‌త్స‌రాల‌ మధ్య ఉంటుందని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో అవుట్‌లెట్‌ వద్ద ఉన్న ఒక పోలీసు అధికారి కాల్పులు విని అటు వైపుకు వెళ్లి సాయుధుడిని హతమార్చాడని చీఫ్ హార్వే చెప్పారు.

Updated On 6 May 2023 11:40 PM GMT
Yagnik

Yagnik

Next Story