☰
✕
Breaking News : నేపాల్ - టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం.. 32కు చేరిన మృతులు
By ehatvPublished on 7 Jan 2025 5:03 AM GMT
భారీ భూకంపం నేపాల్ను వణికించింది.
x
భారీ భూకంపం నేపాల్ను వణికించింది. 7.1 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. పలు చోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం ధాటికి భారత్‌లోని ఢిల్లీ ఎన్సీఆర్, బెంగాల్, బీహార్ లోతో పాటు పలు ప్రాంతాల్లోనూ భూమి ప్రకంపించింది. అలాగే చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.శిథిలాల కింద ఇప్పటి వరకూ 32 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ehatv
Next Story