7 Indians Arrest : అగ్రరాజ్యంలో వ్యభిచారం.. అయిదుగురు తెలుగువాళ్లు అరెస్ట్!
అగ్రరాజ్యం అమెరికాకు(America) వెళ్లినా మనవాళ్లు బుద్ధి పోనిచ్చుకోవడం లేదు.
అగ్రరాజ్యం అమెరికాకు(America) వెళ్లినా మనవాళ్లు బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. అక్కడ వ్యభిచారం(Prostitution) చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులకు దొరికిన ఏడుగురు భారతీయులలో అయిదుగురు తెలుగువారే ఉన్నారు. వ్యభిచారానికి అడ్డుకట్ట వేయడానికి డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీసు డిపార్ట్‌మెంట్ సహకారంతో టెక్సాస్‌లోని(Texas) డెంటాన్‌లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 18 మంది పట్టుబడ్డారు. ఇందులో ఏడుగురు భారతీయులు. అందులోనూ అయిదుగురు తెలుగువారు! అరెస్టయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ చౌదరి రాయపాటి ఉన్నారు. పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్ చౌదరి, అమిత్‌కుమార్‌ను జైల్లో వేశారు. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడంతో పాటు 18 ఏళ్లలోపు మైనర్లను వ్యభిచారం చేయాలని బలవంతం చేసిన ఆరోపణలపై మేకల జై కిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జై కిరణ్‌రెడ్డి, రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్టలను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మందిలో ఇద్దరి దగ్గర అక్రమ ఆయుధాలు కూడా ఉన్నాయట! పట్టుబడిన రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్ చౌదరి టెక్సాస్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ వింగ్ కో ఆర్డనేటర్లు అట!