Power Full Sneeze : గట్టిగా తుమ్మితే పేగులు బయటకు వచ్చాయి..!
తుమ్ము(Sneeze) వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే తుంపర్లు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయట! అంత పవర్‌ఫుల్ అన్నమాట! అంచేత బలవంతంగా తుమ్మును ఆపకూడదు. చాలా ప్రమాదం. అమెరికాలోని ఫ్లోరిడాలో(Florida) ఉంటున్న ఓ 63 ఏళ్ల వ్యక్తి పెద్ద పెట్టున వచ్చిన తుమ్మును ఆపుకోకపోయినా పెద్ద ప్రమాద జరిగింది.

Power Full Sneeze
తుమ్ము(Sneeze) వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే తుంపర్లు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయట! అంత పవర్‌ఫుల్ అన్నమాట! అంచేత బలవంతంగా తుమ్మును ఆపకూడదు. చాలా ప్రమాదం. అమెరికాలోని ఫ్లోరిడాలో(Florida) ఉంటున్న ఓ 63 ఏళ్ల వ్యక్తి పెద్ద పెట్టున వచ్చిన తుమ్మును ఆపుకోకపోయినా పెద్ద ప్రమాద జరిగింది. తుమ్మితే పేగులు మొత్తం(small intestine) బయటకు వచ్చాయట! వెంటనే అతడిగని ఆసుపత్రికి తరలించి సర్జరీ చేయడంతో బతికి బట్టకట్టాడు. తన భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన అతగాడికి హఠాత్తుగా పెద్దపెట్టున తుమ్ము వచ్చింది. కాసేపటికి పొత్తికడుపు భాగమంతా రక్తంతో తడిసిపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న అతడిని భార్య పరిశీలించి చూస్తే అతడి పొట్ట భాగం నుంచి పేగులు బయటకు రావడం కనిపించింది. ఆమె వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి తన భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. డాక్టర్లు కూడా అతని కేసు వివరాలు తెలుసుకొని దిగ్భ్రాంతి చెందారు. గతంలో అతడికి ఉదరభాగంలో సర్జరీ జరిగిందని, పెద్ద పెట్టున వచ్చిన తుమ్ము లేదా దగ్గుతో ఇలా జరిగి వుండవచ్చునని డాక్టర్లు భావిస్తున్నారు.
