ఇటలీ ప్రధాన భూభాగం దక్షిణ తీర సమీపంలో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం అయోనియన్ సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ విషాద0 చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 59 మంది మృత్యు వాత పడ్డారు . విషయం తెలియడం తో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 59 మంది మృతదేహాలను వెలికి తీశారు. అయితే ప్రమాద సమయంలో పడవలో వందమందికి పైగా వలసదారులు ఉన్నట్టు తెలిసింది . పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో అందులోని 58 […]

ఇటలీ ప్రధాన భూభాగం దక్షిణ తీర సమీపంలో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆదివారం అయోనియన్ సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ విషాద0 చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 59 మంది మృత్యు వాత పడ్డారు .
విషయం తెలియడం తో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 59 మంది మృతదేహాలను వెలికి తీశారు. అయితే ప్రమాద సమయంలో పడవలో వందమందికి పైగా వలసదారులు ఉన్నట్టు తెలిసింది . పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో అందులోని 58 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 59మంది మాత్రం అక్క్కడికి అక్కడే మృతి చెందారు . ఈ ఘటనలో పన్నే౦డు మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.

దక్షిణ ఇటలీకి సమీపంలో రాతి దిబ్బలకు కొట్టుకోవడంతోనే ఈ పడవ ప్రమాదం జరిగిందని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. "ప్రస్తుతం, 80 మంది వ్యక్తులు సజీవంగా వెలికితీశారు. వీరిలో కొందరు ఓడ ప్రమాదం తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా చిన్న పడవలో దాని కెపాసిటీకి మించి ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. పడవ ఎక్కడ నుంచి బయలుదేరిందో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది .

కాలాబ్రియాకు వచ్చే వలస నౌకలు సాధారణంగా టర్కిష్ లేదా ఈజిప్షియన్ తీరాల నుంచి బయలుదేరుతాయి. ఈ పడవలలో చాలా పడవలు, పడవలతో సహా, కోస్ట్ గార్డ్ , మానవతావాద రెస్క్యూ నౌకల సహాయం లేకుండా ఇటలీ పొడవైన దక్షిణ తీరప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు తరచుగా వస్తూ ఉంటాయి .

Updated On 27 Feb 2023 8:51 AM GMT
Ehatv

Ehatv

Next Story