అమెరికా(America)లోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్వాడలజారా అనే పెద్ద పారిశ్రామిక కేంద్రంలోని శివారు ప్రాంతంలో జపోపాన్‌ అనే మున్సిపాలిటీ ఉంది. అక్కడ ఉన్న జాలిస్కోలోని 40 మీటర్ల లోతున్న ఒక లోయలో మానవ శరీర భాగాలతో కూడిన 45 బ్యాగులు లభించాయి. ఈ బ్యాగుల్లో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి.

అమెరికా(America)లోని పశ్చిమ మెక్సికో రాష్ట్రంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్వాడలజారా అనే పెద్ద పారిశ్రామిక కేంద్రంలోని శివారు ప్రాంతంలో జపోపాన్‌ అనే మున్సిపాలిటీ ఉంది. అక్కడ ఉన్న జాలిస్కోలోని 40 మీటర్ల లోతున్న ఒక లోయలో మానవ శరీర భాగాలతో కూడిన 45 బ్యాగులు లభించాయి. ఈ బ్యాగుల్లో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి. ఇద్దరు మహిళలు, అయిదుగురు పురుషులు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పోలీసులు వారి ఆచూకి కోసం వెతుకుతున్నప్పుడు ఈ సంఘటన బయటపడింది. మొదట మహిళలు తప్పిపోయినట్టు కంప్లయింట్‌ వచ్చింది. తర్వా పురుషులు కనిపించడం లేదన్న ఫిర్యాదు అందింది. మిస్సింగ్‌ కేసులు వేరువేరు రోజుల్లో వేరువేరుగా అందినప్పటికీ వారందరూ ఓకే కాల్‌ సెంటర్‌లో పని చేసేవారు కావడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్‌ సెంటర్‌ కూడా ఉంది. 45 బ్యాగుల్లో ఉన్న మానవ శరీర భాగాలు ఎంతమందివన్నది ఇంకా తేలలేదు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ పనిలోనే ఉన్నారు. కాల్‌ సెంటర్‌లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్‌ సెంటర్‌ దగ్గర మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు లభించాయి. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా లభ్యమయ్యాయి. మిస్సింగ్‌ వ్యక్తులకు చెందిన కుటుంబ సభ్యులు మాత్రం తమవారిని నేరస్తులుగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదంటున్నారు. పోలీసులు వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. జాలిస్కోలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది మొదటిసారేం కాదు. 2021లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. జాలిస్కోలోని తోనాలా మున్సిపాలిటీలో 11 మంది మానవ అవశేషాలతో కూడిన 70 బ్యాగులు బయటపడ్డాయి. 2019లో జపోపాన్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో 119 బ్యాగులు దొరికాయి. ఇందులో 29 మంది మనుషుల అవశేషాలను కనుగొన్నారు. 2018లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వారి ఆచూకి కోసం వెతికితే వారి అవశేషాలు లభించాయి. బతికుండగానే వారిని యాసిడ్‌లో కరిగించినట్టు తేలింది. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

Updated On 2 Jun 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story